కరీంనగర్ జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.
కాటారం : కరీంనగర్ జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
వీరంతా కర్నూలు జిల్లాకు చెందిన వారు. గోదావరి పుష్కరాల కోసం కాళేశ్వరం వెళుతుండగా ప్రమాదం బారినపడ్డారు. క్షతగాత్రులను మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.