చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు | Bomb Explosion at Chennai Central Railway Station, 10 injured | Sakshi
Sakshi News home page

చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు

Published Thu, May 1 2014 8:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు

చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు

చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పదిమంది గాయపడినట్లు సమాచారం. రైల్వే స్టేషన్లోని 9వ నెంబర్ ఫ్లాట్ఫామ్ పై నిలిచి ఉన్న (త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న) గౌహతి ఎక్స్ప్రెస్ ఎస్-5 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు.  ఈ పేలుడు ఉదయం 7.20 నిమిషాలకు జరిగింది.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం  రైల్వే పోలీసులు అంబులెన్స్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పేలుడు నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement