చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ బాంబు పేలుళ్ల ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తొమ్మిదో నెంబర్ ఫ్లాట్ఫామ్పై నిలిచి ఉన్న గౌహతి ఎక్స్ప్రెస్ లోని ఎస్-4,5 బోగీల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు గుర్తించారు. ఎస్-4 బోగీలోని సీటు నెంబరు 70 వద్ద పేలుళ్లు జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. గురువారం ఉదయం 7.20 నిమిషాలకు మొదటి పేలుడు, వెంటనే రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో రెండు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
ఇక జంట పేలుళ్లలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 15 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు రైల్వే స్టేషన్ను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీ టీవీ పుటేజ్లను పరిశీలిస్తున్నారు. అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఎస్-4 బోగీలోని సీటు నెం.70వద్ద పేలుడు!
Published Thu, May 1 2014 9:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement
Advertisement