ప్రతీకాత్మక చిత్రం
కర్నూలు జిల్లా : ఫ్యాపిలీ మండలం సీతారామపురం వద్ద ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు కృష్ణగిరి మండలం చిట్యాలకు చెందిన వారిగా గుర్తించారు.
మహాశివరాత్రి సందర్భంగా యాగంటి క్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment