krishnagiri
-
విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌రేప్.. తమిళనాడులో వెలుగు చూసిన దారుణం
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోయారు. సభ్య సమాజం తల దించుకునేలా టీచర్లు వ్యవహరించారు. ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో, ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని గర్భం దాల్చింది. అసలు విషయం తన తల్లికి చెప్పడంతో ఆవేదన చెందిన ఆమె.. బిడ్డను గత నెల రోజులుగా పాఠశాలకు పంపించలేదు. స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిసింది.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే శిశు సంక్షేమ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితురాలితో ఫిర్యాదు చేయించారు. దీంతో, బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, రంగంలోకి దిగిన శిశు సంక్షేమ శాఖ అధికారులు.. దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్(37)ను అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటన చర్చనీయాంశంగా మారడంతో స్థానికులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు.. ఈ ఘటన అనంతరం వారిని జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తమిళనాడులో వరుస లైంగిక దాడుల ఘటనలు స్టాలిన్ సర్కార్‌కు మచ్చ తెస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో, ప్రతిపక్ష బీజేపీ నిరసనలు చేపట్టింది. స్టాలిన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.Tamil Nadu | A 13-year-old girl student was allegedly sexually assaulted by three teachers at a government middle school in Krishnagiri district. The three teachers have been suspended by the District Education Officer (DEO) and arrested under various sections of the Protection…— ANI (@ANI) February 6, 2025 -
నా కూతురినే పెళ్లి చేసుకుంటావా.. నీకు ఎంత ధైర్యం
తమిళనాడు: తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని కత్తులతో నరికి హత్య చేసిన సంఘటన కృష్ణగిరిలో సంచలనం కలిగించింది. కృష్ణగిరి సమీపంలో వున్న కిడామ్‌పట్టికి చెందిన చిన్నయ్యన్ కుమారుడు జగన్ (28) టైల్స్ అతికించే పనిచేస్తుంటాడు. ఇతను కృష్ణగిరి జిల్లా ములంగళ్‌కు చెందిన శంకరన్ కుమార్తె శరణ్య (21)ను ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వారి ప్రేమను ఒప్పుకోలేదు. ఆమెకు మరొక యువకుడితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో జగన్, శరణ్య ఒక క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో శరణ్య కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై కక్ష పెంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జగన్ మోటారు సైకిల్‌పై ధర్మపురి, కృష్ణగిరి రోడ్డులో వెళుతుండగా శరణ్య తండ్రి శంకరన్, తన బంధువుతో కలిసి అతన్ని అడ్డగించారు. కత్తులతో దాడి చేశారు. జగన్ గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కావేరి పట్టణం పోలీసులు అక్కడికి చేరుకుని జగన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. యువకుడి తల్లిదండ్రులు లీసులను అడ్డుకుని న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఎస్పీ సరోజ్‌కుమార్ ఠాగూర్, సహాయ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ తమిళరసి అక్కడికి చేరుకుని హంతకులను త్వరలోనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత మృతదేహాన్ని కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగన్ మామ శంకరన్, బంధువులు అరులు, గోవిందరాజు, తిమ్మరాయ కోసం గాలింపు చర్యలు చేపట్టగా శంకరన్ మంగళవారం రాత్రి కృష్ణగిరి అదనపు మహిళా పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. -
ఒక్క పాటతో కోట్ల మంది మదిని గెలిచింది.. ఆ పాటతోనే..
ఆ యువతి బస్సు సౌకర్యం లేని మారుమూల గ్రామంలో జన్మించింది. అయితేనేం. ‘ఊరంత వెన్నెలా.. మనసంతా చీకటి’ పాటతో కోట్లాది మంది మదిని గెలిచింది. పుట్టిన ఊరికి పేరు ప్రతిష్టతో పాటు బస్సు సౌకర్యం తీసుకొచ్చింది దాసరి లక్ష్మీపార్వతి. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన ఈ యువ గాయని శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడింది. మనోగతం ఆమె మాటల్లోనే.. saregamapa singer parvathy: మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. మా తల్లిదండ్రులు దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూమార్తెలు సంతానం. అందరి కంటే మా కుటుంబంలో పెద్దది అక్క సరస్వతి, తర్వాత ఇద్దరు అన్నలు చంద్రమోహన్, ఉపేంద్ర. వారి తర్వాత నేను పుట్టాను. మాకున్న 4.70 ఎకరాల పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే ఇష్టం. మా ఊరి ప్రాథమిక స్కూలులో చదివేటప్పుడు మొదటిసారిగా ‘పుట్టింటికిరా చెల్లి’ సినిమాలో పాట పాడాను. దీన్ని విన్న మా ఉపాధ్యాయుడు మద్దయ్య భవిష్యత్తులో మంచిస్థాయిలో ఉంటావని చెప్పి అభినందించారు. తర్వాత 4,5 తరగతులను డోన్ మండలం జగదుర్తి గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో, 6 నుంచి 10 తరగతి వరకు కొత్తపల్లె మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల, ఇంటర్ ఎమ్మిగనూరు ప్రభుత్వ కాలేజీలో చదివాను. నేను అక్కడ పాటలు పాడటాన్ని చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించేవారు. ఇంటర్ తర్వాత వ్యవసాయం కలిసిరాక కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఏడాదిపాటు ఇంటి దగ్గరే ఉన్నా. ఈ సమయంలో మా అమ్మనానలు, అన్నలు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసి వారితో పాటు నేను పొలం పనులకు వెళ్లాను. తిరుపతి సంగీత కళాశాలలో శిక్షణ ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే పలుకూరు గ్రామానికి చెందిన హర్మోనిస్టు హరి విని సంగీతం నేర్పిస్తే మీ చెల్లెలు మంచి గాయని అవుతుందని మా అన్నయ్యకు చెప్పారు. అలా ఆయన ద్వారానే తిరుపతిలో సంగీత కళాశాల ఉందనే విషయం తెలుసుకుని 2017లో ఆ కళాశాలకు అన్లైన్లో దరఖాస్తు చేసుకుని చేరాను. అక్కడ గురువు వల్లూరి సురేష్‌బాబు వద్ద శిక్షణ తీసుకున్నాను. గతేడాది డిసెంబర్ 9న ఎస్వీబీసీలో చానల్లో ‘అదిగో అల్లదిగో’ ప్రోగ్రాంకు పాట పాడే అవకాశం వచ్చింది. అక్కడ ‘ఏమి చేయవచ్చునే’ అనే అన్నమయ్య కీర్తన పాడాను. న్యాయనిర్ణేతగా వచ్చిన ఎస్పీ శైలజ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. పాటతో బస్సు వచ్చింది ఈయేడాది జనవరి 14న ఓ తెలుగు చానల్లో సరిగమప కార్యక్రమానికి సెలెక్షన్ నిర్వహించారు. అందులో నేను ఎంపికై తొలుత ‘ఊరంత వెన్నెల.. మనసంతా చీకటి’ పాట పాడాను. నా పాటను మెచ్చి సంగీత సామ్రాట్ కోటి నీకు ఏమీ కావాలో కోరుకోమన్నారు. వెంటనే మా గ్రామానికి బస్సు వేయాలని కోరా. అందుకు న్యాయనిర్ణేతలు అంగీకరించి ఏపీ మంత్రి పేర్ని నానితో మాట్లాడి డోన్ నుంచి దేవనకొండ వెళ్లే బస్సును మా గ్రామానికి వచ్చేలా చేశారు. ఇందుకు సహకరించిన అందరికీ ప్రత్యేకంగా మా గ్రామం తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నా. అలాగే కర్నూలు నుంచి వయా ఈదుల దేవరబండ మీద మా గ్రామ సమీపంలోని బండపల్లె వరకు బస్సు వస్తుంది. అది కూడా మా గ్రామంలోకి వచ్చిపోతే వివిధ పనుల మీద నేరుగా కర్నూలుకు వెళ్లే రైతులకు మేలు జరుగుతుందని గాయని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో మంచి సింగర్‌గా స్థిరపడి జిల్లాలో సంగీత పాఠశాల ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వాలన్నదే తన ఆశయమని ఈ యువ గాయని చెప్పుకొచ్చారు. -
మొదటి భార్య నాలుగో కూతురు.. రెండో భార్య కొడుకు మధ్య ప్రేమ..
క్రిష్ణగిరి (కర్ణాటక): వరుసకు సోదరుడు అయ్యే బాలునితో ప్రేమ వద్దని మందలించగా బాలిక ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కార్మికుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నల్గురు పిల్లలు. రెండవ భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భార్య నాలుగవ కూతురు(16), రెండవ భార్య 16 ఏళ్ల కుమారుని మధ్య ప్రేమాయణం మొదలైంది. విషయం తెలిసిన పెద్దలు మందలించడంతో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి మహిళా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) -
సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?
‘లెర్న్ ఫ్రమ్ ది మాసెస్...’ అనే మావో మాట అంకిత్ విన్నాడో లేదో తెలియదుగానీ ఆచరణ లో అలాగే చేశాడు. ‘నువ్వు చదవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక పుస్తకం. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక మహా విశ్వవిద్యాలయం’ అనే మంచి మాట నచ్చి కొత్త బాట పట్టాడు... ప్రపంచం సంగతి సరే, ముందు దేశాన్ని చుట్టిరావాలని, ప్రజల దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలనే బలమైన కోరిక జైపూర్ (రాజస్థాన్) కు చెందిన అంకిత్ అరోరాకు కలిగింది. అలా అని విమానం ఎక్కే ఆర్థిక పరిస్థితి తనకు లేదు. ఎదురుగా సైకిల్ కనిపించింది. ‘అవును. సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది. ‘చాలా కష్టమేమో’ అన్నది తనలోని మరో వెర్షన్. ‘కాలినడకన దేశాలు తిరిగే వాళ్లు ఉన్నారు. సైకిల్‌పై వెళ్లడం అసాధ్యమేమీ కాదు’ అని తనకు తాను చెప్పుకున్నాడు. అతడు బయలుదేరాడు.... నాలుగు సంవత్సరాల పాటు సాగిన తన యాత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో పల్లెలు చూశాడు. మహారాష్ట్రలో దారుశిల్పాలు, తంజావూరులో ఆదివాసి కళలు, తమిళనాడులో సంగీతవాద్య పరికరాల తయారీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడంటే సేంద్రియ వ్యవసాయం గురించి ఘనంగా చెప్పుకుంటున్నాంగానీ, దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో చా...లా ఏళ్ల క్రితమే ఈ ఆదర్శనీయ వ్యవసాయ విధానం అమలులో ఉంది. వాటిని దగ్గరగా గమనించిన అంకిత్ ఇతర ప్రాంతాలకు ప్రయాణమైనప్పుడు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి ఆ విషయాలను చెప్పేవాడు. ‘మీరు మాత్రం ఇలా ఎందుకు చేయకూడదు’ అనేవాడు. ఉత్తమ వ్యవసాయ విధానాలు, చెట్లు, నీటిసంరక్షణ... ఇలా తాను తెలుసుకున్న ఎన్నో విషయాలను ప్రచారం చేస్తూ వెళ్లాడు. (చదవండి: సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!) ‘నువ్వు సర్కార్ తరపున వచ్చావా? నీకు జీతం ఎంత ఇస్తారు?’ ఇలాంటి ప్రశ్నలెన్నో అడిగే వాళ్లు రైతులు. ‘లేదు’ అనే మాట వారిని ఆశ్చర్యానికి గురి చేసేది. కళ్లతోనే అభినందించి, ఆదరించి తిండి పెట్టేవారు. కొందరు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టేవారు. అయితే కొన్ని ప్రాంతాలలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. శ్రీనగర్‌లో తనను దొంగగా అనుమానించారు. మరోచోట స్మగ్లర్ అనుకొని వెంబడించారు. అయితే అది కొద్దిసేపు. నిజం తెలుసుకున్నాక అనుమానించినవారే హృదయపూర్వకంగా అభినందించారు. ప్రఖ్యాత కవి విలియమ్ బట్లర్ ఈట్స్ ‘ది లేక్ అయాల్ ఆఫ్ ఇన్నిస్‌ఫ్రీ’ కవితలో కనిపించే ఆదర్శ, ప్రశాంత, కళాత్మక వ్యవసాయక్షేత్రం ఒకటి ప్రారంభించాలనేది తన కల. బెంగళూరుకు చెందిన శ్రీదేవి, అంకిత్ ఊహలకు రెక్కలు ఇచ్చారు. క్రిష్టగిరి దగ్గర శ్రీదేవి కుటుంబ సహాయ సహకారాలతో ‘ఇన్నిస్ ఫ్రీ’ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాడు. రసాయనాలు ఉపయోగించకుండా కూరగాయలు ఎలా పండించాలి? ఎకో–టాయిలెట్స్ ఎలా నిర్మించుకోవాలి? పశువులకు బలమైన మేత.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇదొక బడిగా మారింది. (చదవండి: సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..) తాను తిరగాల్సిన ప్రదేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో మొదటిది ఈశాన్య ప్రాంతాలు. అక్కడకు వెళ్లాలని, అక్కడ నేర్చుకున్న మంచి విషయాలను ఇతర చోట్ల ప్రచారం చేయాలనుకుంటున్నాడు అంకిత్. అంకితభావం ఉన్నవారి కలలు నెరవేరడానికి అట్టే సమయం పట్టదు కదా! -
Ola Future Factory: రెండు చక్రాలు.. 20 వేల చేతులు
అందరూ స్త్రీలే పని చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని ఓలా కార్యాచరణలో పెట్టింది. 10 వేల మంది మహిళా కార్మికులను భర్తీ చేయనుంది. ప్రపంచంలో ఇంతమంది స్త్రీలు పని చేసేæఫ్యాక్టరీ, ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ఇది ఒక్కటే. ‘పురుషులు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఓలా అంటోంది. ఇన్నాళ్లు ఫ్యాక్టరీలను పురుషులు నడిపారు. ఈ పర్యావరణ హిత స్కూటర్ ఫ్యాక్టరీని స్త్రీలు నడపనున్నారు. తమిళనాడు కృష్ణగిరిలో ఒక ఘనమైన మహిళా ఘట్టం మొదలైంది. అక్కడ స్థాపితమైన ‘ఓలా ఈ–స్కూటర్ ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ పూర్తిగా మహిళా కార్మికులతో, సిబ్బందితో పని చేయనుంది. మొత్తం 10 వేల మంది స్త్రీలు ఈ ఓలా ఫ్యాక్టరీలో పని చేయనున్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఫ్యాక్టరీలో చేరింది. ఇంకో ఐదారు నెలల్లో మొత్తం మహిళా కార్మికులు చేరితే ఇదొక అద్భుతమైన స్త్రీ కార్మిక వికాస పరిణామం అవుతుంది. దీనికి అంకురార్పణ చేసిన ఓలా చరిత్ర లిఖించినట్టవుతుంది. ‘స్త్రీ బలపడితే సమాజం బలపడుతుంది’ ఓలా చైర్మన్– గ్రూప్ సి.ఇ.ఓ భవిష్ అగర్వాల్ సోమవారం ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ‘మా మొదటి బ్యాచ్ వచ్చింది. మిగిలిన వారు రావడమే తరువాయి’ అని ఆయన అన్నారు. ఈ–స్కూటర్ తయారు చేయనున్న ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలోని దాదాపు వందమంది తొలి మహిళా కార్మిక బ్యాచ్‌తో ఆయన సెల్ఫీ దిగారు. ‘స్త్రీలను ఆర్థికంగా బలపరిస్తే కుటుంబం బలపడుతుంది. దాంతో సమాజం బలపడుతుంది. మహిళా ఆర్థిక స్వావలంబనతో జి.డి.పి పెరుగుతుంది’ అని భవిష్ అన్నారు. ‘పారిశ్రామిక రంగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉంది. ఈ శాతం పెంచాలంటే అందరం కలిసి స్త్రీలను అందుకు ప్రోత్సహించాలి. మా వంతుగా మేము ఓలా ఈ–స్కూటర్ ఫ్యాక్టరీని పూర్తిగా స్త్రీలతోనే నిర్వహించనున్నాం’ అని ఆయన అన్నారు. పర్యావరణానికి హాని చేసే పెట్రోల్ టూవీలర్లకు ప్రత్యామ్నాయంగా ఈ–స్కూటర్ల తయారీ దేశంలో ఊపందుకుంటోంది. ఓలా ఈ రంగంలో ప్రధాన వాటా పొందేందుకు భారీ స్థాయిలో ఫ్యూచర్ ఫ్యాక్టరీని కృష్ణగిరిలో స్థాపించింది. ఇది పూర్తి కావడానికి సుమారు 2500 కోట్లు అవుతాయని అంచనా. 2022లో మార్కెట్లోకి వచ్చే లక్ష్యంగా ఇది పని చేయనుంది. ‘సంవత్సరానికి కోటి ఈ–స్కూటర్లు లేదా ప్రపంచ మార్కెట్లో 22 శాతం ఈ–స్కూటర్లు తయారు చేయడం ఈ ఫ్యాక్టరీ లక్ష్యం’ అని భవిష్ తెలియచేశారు. ప్రతి రెండు సెకండ్లకు ఒక స్కూటర్ తయారయ్యే స్థాయిలో వేల మంది మహిళా సిబ్బంది ఇక్కడ పని చేస్తారు. వీరికి 3000 రోబోలు సహకరించనున్నాయి. ‘మేము మహిళలతో ఈ ఫ్యాక్టరీని నడిపేందుకు పూర్తిస్థాయి శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నాం. అక్కడ శిక్షణ ముగించుకుని వచ్చి ఫ్యాక్టరీలో చేరుతారు’ అని భవిష్ చెప్పారు. ఇంతవరకూ అందరూ సైరన్ మోగుతుంటే డ్యూటీకి వెళ్లే పురుషులను చూశారు. మరి కొన్నాళ్లలో వేల మహిళలు ఈ ఫ్యాక్టరీలోకి వెళ్లే దృశ్యం కచ్చితంగా కోట్ల మంది స్త్రీలకు స్ఫూర్తిదాయకం కానుంది. -
స్నేహితుడితో కలిసి అత్త హత్య.. కోడలు అరెస్టు
తుమకూరు/కర్ణాటక: శిర తాలూకాలోని ఉజ్జనకుంటె గ్రామానికి చెందిన సరోజమ్మ (65) ఈ నెల 24న తేదీన ఉదయం ఇంట్లో మంటల్లో చిక్కుకుని చనిపోయింది. ఇది ప్రమాదం కాదని, హత్య అని సరోజమ్మ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టి సరోజమ్మ కోడలు సుధామణి, ఆమె పరిచయస్తుడు శ్రీరంగప్పలను తావరకెరె పోలీసులు అరెస్టు చేశారు. అత్త కోడలు మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఈ కారణంతోనే పెట్రోలు పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఆలయానికి వెళ్లి వస్తూ...కారు ఢీకొని దంపతులు దుర్మరణం క్రిష్ణగిరి: ద్విచక్ర వాహనంలో ఆలయానికి వెళ్లి వస్తూ కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందిన ఘటన సూళగిరి సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకొంది. హోసూరు భారతి నగర్‌కు చెందిన మురళి (35), భార్య రాణి (30) ఉదయం హోసూరు నుండి ద్విచక్ర వాహనంలో కామనదొడ్డి సమీపంలోని దక్షిణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా కళ్లకురిచ్చి నుండి బెంగళూరుకు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో దంపతులు ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లై 8 నెలలు.. కోర్టు ఆవరణలో పోలీసు బలవన్మరణం
సాక్షి, చెన్నై: పని భారమా, కుటుంబ కష్టమా ఏమోగానీ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి గన్‌మన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం కృష్ణగిరి కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణగిరి రైల్వే కాలనీకి చెందిన అన్బరసన్(29) సాయుధ విభాగంలో పోలీసు. కృష్ణగిరి మొదటి మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కలైమదికి గన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం నైట్ షిఫ్ట్‌కు వచ్చిన అన్బరసన్ గురువారం ఉదయాన్నే న్యాయమూర్తి కలై మదితో కలిసి ఆయకోట్టై రోడ్డులోని కోర్టుకు వచ్చాడు. న్యాయమూర్తి తన గదిలోకి వెళ్లిపోవడంతో తాను అక్కడి మెట్లపై కూర్చున్నాడు. కాసేపటికి పైకి లేచిన అన్బరసన్ హఠాత్తుగా తుపాకీని నెత్తిపై పెట్టుకుని కాల్చుకున్నాడు. తుపాకీ పేలిన శబ్దంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. అటు వైపు అందరూ పరుగులు తీశారు. రక్తపు మడుగులో అన్బరసన్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కృష్ణగిరి ఎస్పీ పాండి గంగాధర్, ఏడీఎస్పీ అన్బు, డీఎస్పీ శరవణన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. విచారణలో అన్బరసన్‌కు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. అతడి భార్య నాలుగు నెలల గర్భవతిగా తేలింది. కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే, పనిభారంతో బలన్మరణానికి పాల్పడ్డాడా లేదా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
నా కూతుర్నే ప్రేమిస్తావా.. యువకుడిపై దారుణం
సాక్షి, బెంగళూరు(క్రిష్ణగిరి): నా కూతుర్ని ప్రేమిస్తావా అని ఓ వ్యక్తి యువకున్ని హత్య చేశాడు. వివరాలు.. బెంగళూరు జే.పి.నగరలో వసంత్ (25) కాయగూరల వ్యాపారి. అదే ప్రాంతంలో కాయగూరలమ్మే నారాయణన్ కూతురు సౌమ్య (18). వసంత్– సౌమ్య మధ్య ప్రేమ చిగురించింది. ఇది తెలిసి అమ్మాయిని తండ్రి నారాయణన్ మందలించాడు. అయినప్పటికీ ఆమె వసంత్‌తో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ వచ్చింది. దీంతో నారాయణన్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. నా కూతురితో పెళ్లి చేస్తానని ఆశచూపి ఆదివారం రాత్రి వసంత్‌ను తీసుకొని బేరికె సమీపంలోని ఓ రహస్య స్థలానికెళ్లాడు. వసంత్‌తో బాగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న వసంత్‌పై బండరాయితో బాది దారుణంగా హత్య చేశాడు. అనంతరం నారాయణన్ బేరికె పోలీసులకు లొంగిపోయాడు. సోమవారం ఉదయం పోలీసులు నిందితున్ని తీసుకుని ఘటనా స్థలానికి తీసుకెళ్లి వసంత్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కట్న పిశాచికి కారాగారం తుమకూరు: అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన భర్తకు తుమకూరు జిల్లా కోర్టు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 30 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. వివరాలు...తుమకూరు నగరంలోని వీరసాగరలో నివాసం ఉంటున్న మహ్మద్ అబూబకర్‌కు 2015 డిసెంబర్లో యాస్మిన్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాదికే విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువు కావడంతో సోమవారం జిల్లా కోర్టు న్యాయమూర్తి మల్లికార్జునస్వామి నిందితుడికి ఐదేళ్ల జైలు, రూ. 30 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కామాంధునికి 20 ఏళ్ల జైలు తుమకూరు: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తుమకూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. 2018 తుమకూరు జిల్లా శిరా తాలూకా తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తావరకెరెలో దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్న ప్రభు (48) అనే వ్యక్తి 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారుణం రుజువు కావడంతో సోమవారం న్యాయస్థానం కామాంధునికి 20 ఏళ్ల జైలు, రూ. 25 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. చదవండి: పక్కూరి జాతరకు.. అక్కడినుంచి చెన్నై -
వామ్మో.. ఎన్ని పాము పిల్లలు
సాక్షి, కృష్ణగిరి: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలొం అమకతాడు గ్రామంలోని ఓ ఇంట్లో పాములు కలకలం రేపాయి. ఇంటి మెట్ల కింద ఏకంగా 66 పాము పిల్లలు, 80కి పైగా పాము గుడ్లు ఉండటంతో ఆ ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారు. ఈ విషయం మంగళవారం రాత్రి వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తలారి శేషన్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు మెట్లపై కూర్చుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఒక పాము పిల్ల ఇంటి ముందు కనిపించింది. బయటి నుంచి వచ్చిందనుకుని దాన్ని చంపేశారు. మంగళవారం మెట్ల కింద రంధ్రం కనిపించడంతో అనుమానంతో దానిలోకి పొగ పెట్టారు. దీంతో ఒక్కొక్కటిగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. చివరకు మెట్లను పూర్తిగా పెకిలించి చూడగా... అందులో 66 నాగుపాము, జర్రిపోతు పిల్లలు, 80 దాకా పాము గుడ్లు కనిపించాయి. గ్రామస్తులు పాము పిల్లలను చంపేసి, గుడ్లను ధ్వంసం చేశారు. -
హీరో విజయ్ ఫ్యాన్స్ అరెస్ట్
అభిమానం హద్దు మీరింది. బిగిల్ చిత్రం విడుదల సందర్భంగా విజయ్ అభిమానులు విధ్వంసానికి దిగారు. ముందుగా సినిమా ప్రదర్శించలేదని థియేటర్లోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సీసీ టీవీలను పగులకొట్టారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రం విడుదల విధ్వంసానికి, లాఠీ చార్జ్‌కి దారితీసింది. విజయ్ అభిమానుల ఆగ్రహానికి అంగళ్లతోపాటూ పోలీసు వాహనం కూడా అగ్నికి ఆహుతైంది. నలుగురు పోలీసులు గాయపడగా, పలువురు అభిమానులు కటకటాల పాలయ్యారు. తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్ తరువాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న హీరో విజయ్. ఆయన సినిమా అంటే అభిమానులకు పండుగే. శుక్రవారం విజయ్ చిత్రం విడుదల కావడంతో అభిమానుల్లో ఆనందం కట్టలుతెంచుకుంది. దర్శకుడు అట్లీ, విజయ్, నయనతార కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన కోసం అభిమానులు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. అయితే గురువారం రాత్రి ప్రభుత్వం అకస్మాత్తుగా తొలిరోజు మాత్రం ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇవ్వడంతో ఒకింత శాంతించారు. శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రత్యేక షో ప్రదర్శితమైంది. కృష్ణగిరిలో రెండు థియేటర్లలో బిగిల్ ప్రదర్శనకు సిద్ధంకాగా, అభిమానుల కోసం శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని యాజమాన్యం ప్రకటించింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడం ప్రారంభించారు. క్రమేణా ఈ సంఖ్య మరింత పెరిగిపోవడంతో తోపులాట, తొక్కిసలాట మొదలైంది. వెంటనే షో వేయాలని అభిమానులు కేకలు వేశారు. అయితే 3 గంటల తరువాత మాత్రమే ప్రత్యేక ప్రదర్శన వేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని యాజమాన్యం వారికి తెలిపింది. దీంతో అసహనానికి లోనైన అభిమానులు విధ్వంస చర్యలు ప్రారంభించారు. థియేటర్లోకి జొరబడి కుర్చీలను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న అంగళ్లను, ప్రకటన బోర్డులను తగులబెట్టారు. థియేటర్‌కు అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. అప్పటికే గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు అభిమానులను చెదరగొట్టడం ప్రారంభించగా గందరగోళం నెలకొంది. పోలీసులపై అభిమానులు దాడికి దిగారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అభిమానుల దాడులు అదుపు తప్పడంతో పోలీసులు కంట్రోలు రూముకు ఫోన్ చేయడంతో ప్రత్యేక పోలీసు దళం రంగప్రవేశం చేసి లాఠీచార్జ్‌కి దిగారు. ఈ గొడవల్లో నలుగురు పోలీసులకు, కొందరు అభిమానులకు గాయాలయ్యాయి. పోలీసుల అదుపులో 37 మంది.. ఆస్తులను ధ్వంసం చేసిన వారిలో 37 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణగిరిలోని రెండు థియేటర్ల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శుక్రవారం తెల్లవారుజాము 5 గంటలకు అభిమానుల కోసం ప్రత్యేక షో వేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వందలాది థియేటర్లలో యధావిధిగా విడులైంది. విజయ్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. నకిలీ టోకెన్లు.. ప్రత్యేక షో చూసేందుకు నకిలీ టోకెన్లతో వచ్చిన ముగ్గురు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూత్తుకూడిలో రెండు థియేటర్లలో బిగిల్ విడుదలైంది. విజయ్ అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శన కోసం ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం నగదు మొత్తాన్ని యాజమాన్యానికి చెల్లించారు. ఆ తరువాత తొలి ప్రదర్శనకు టిక్కెట్ల పంపిణీకై టోకన్లను పంపిణీ చేశారు. అయితే కొందరు అభిమాలను చేతుల్లోని టోకన్లపై అభిమాన సంఘం నేతలకు అనుమానం రావడంతో తనిఖీ చేయగా అవి నకిలీ టోకన్లని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో రాజన్ (28), మోహన్‌బాబు (26), ఆనంద్ (30)లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ టోకన్లను ముద్రించిన తిరునెల్వేలీకి చెందిన ఒక వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కోర్టులు, కేసులు, ఆరోపణలు, వ్యతిరేకతలను అధిగమించి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగిల్ చిత్రం తెలుగులో ‘విజిల్’ గా విడుదలైంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. మరోవైపు సినిమా పాజిటిల్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ మాస్ పాత్రలో ఇరగదీశాడంటూ, సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యాడంటూ అభిమానులు ట్విట్ చేస్తున్నారు. -
కృష్ణాగిరిలో సంఘీభావయాత్ర
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
చెన్నై : తమిళనాడులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కృష్ణగిరి సమీపంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లోయలో పడ్డ ఆటో..ఇద్దరి మృతి
కర్నూలు జిల్లా : ఫ్యాపిలీ మండలం సీతారామపురం వద్ద ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు కృష్ణగిరి మండలం చిట్యాలకు చెందిన వారిగా గుర్తించారు. మహాశివరాత్రి సందర్భంగా యాగంటి క్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హీరోయిన్ సమంతను చుట్టుముట్టిన ఫ్యాన్స్
-
సమంతను చుట్టుముట్టిన ఫ్యాన్స్
సాక్షి, చెన్నై: ప్రైవేటు నగల దుకాణానికి విచ్చేసిన హీరోయిన్ సమంతను చూసేందుకు వచ్చిన అభిమానులు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి అంబాసిడర్‌గా ఉన్న సమంత వచ్చారు. ఈ విషయం తెలుసుకుని ఆమెను చూసేందుకు వేలాది మంది దుకాణం ముందు గుమిగూడారు. దుకాణం ప్రారంభించిన అనంతరం బయటకు వచ్చిన సమంత అభిమానులకు చేతులు ఊపుతూ తన కారు ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆమె కారు వద్దకు దూసుకు వచ్చారు. పోలీసులు అప్రమత్తమై సమంతను కారులో ఎక్కించి అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అభిమానులు కారు వైపుకు దూసుకురావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అభిమానుల హడావుడి, పోలీసుల లాఠీచార్జ్ నేపథ్యంలో కృష్ణగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. -
కనిపిస్తే చంపేస్తోంది..
క్రిష్ణగిరి : సూళగిరి సమీపంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. తాను వెళ్లే దారిలో ఎవరు కనిపించినా దాడి చేసి ప్రాణాలు తీస్తోంది. శనివారం ఉదయం ఓ వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగు అదే రోజు రాత్రి మరోమారు స్వైర విహారం చేసింది. నడిచి వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. దీంతో సూళగిరి ప్రాంత ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోని భీతిల్లుతున్నారు. సూళగిరి సమీపంలోని దేవరగుట్టపల్లి గ్రామానికి చెందిన మునిరాజు(55) శనివారం రాత్రి చిన్నారు వద్ద నడచి వెళ్తుండగా ఏనుగు దాడి చేసి అంతమొందించింది. ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగులను తరిమివేయకపోవడం వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆందోళనకు దిగారు. వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. జిల్లా కలెక్టర్ సి.కదిరవన్, జిల్లా అటవీశాఖాధికారి దీపక్విల్జీలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డెంకణీకోట, రాయకోట, క్రిష్ణగిరి, శ్యానమావు, సూళగిరి అటవీశాఖ బృందాలను రప్పించారు. పశువైద్యులు ప్రకాష్ బృందాన్ని రంగంలోకి దింపారు. మత్తుమందు ఇచ్చి ఏనుగును బంధించేందుకు చర్యలు చేపట్టడంతో స్థానికులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు మునిరాజు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య క్రిష్ణమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఎంజీఆర్, జయలలిత విగ్రహాల ఏర్పాటు
క్రిష్ణగిరి(సూళగిరి): తమ లీడర్‌పై నాయకులకు అమితమైన ప్రేమ ఉంటుంది. అలాంటి అభిమానం ఎంతటికైనా దారితీస్తుంది. ఆ అభిమానమే వారి విగ్రహాల ఏర్పాటుకు కారణమైంది. తమిళనాడులోని సూళగిరి యూనియన్ అన్నాడీఎంకే వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలంలో, సొంత ఖర్చుతో దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుడు గోవిందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నాడీఎంకే నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హజరయ్యారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 17మంది మృతి
చెన్నై: చెన్నై: తమిళనాడులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లా నేల్మలై సమీపంలో ఓ ప్రయివేటు బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో 17మంది దుర్మరణం చెందారు. మరో 15మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 33మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా బెరిగాయ్ నుంచి కృష్ణగిరి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కాగా కర్ణాటక నుంచి వేరుశెనగ లోడుతో వస్తున్న లారీ అయిదో నెంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పింది. లారీ ముందుగా బస్సును ఆ తర్వాత ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 12ఏళ్ల చిన్నారి సహా ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. కాగా మృతుల వివరాలతో పాటు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తారస్థాయికి బీజేపీలో అసమమ్మతి
► మూడు రోజులుగా మూతపడిన కెలమంగలం బీజేపీ కార్యాలయం ► గుర్తింపు లేని వ్యక్తికి టికెట్ కేటాయింపుపై అసంతృప్తి డెంకణీకోట : తళి నియోజకవర్గంలో బీజేపీ అసమ్మతి కార్యకలాపాలు తారస్థాయికి చేరుకొన్నాయి. కెలమంగలంలోని సమితి బీజేపీ కార్యాలయం మూడు రోజులుగా మూతపడి ఉంది. తళి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం ఎక్కువ మంది అశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. బీజేపీ అధిష్టానం హొసూరు, తళి, క్రిష్ణగిరిలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తళి నియోజకవర్గంలో టికెట్ కోసం కే,సి. మునిరాజు, ఎన్. గోపాలరెడ్డి వంటి పలుకుబడి, ఆర్థిక స్థోమత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరికి టికెట్ లభించలేదు. సామాన్య కార్యకర్తగా గుర్తింపు పొందిన బీ రామచంద్రన్‌కు టికెట్ లభించంతో తీవ్ర అసంతృప్తి బయలుదేరింది. ఆయన సరైన అభ్యర్థి కాదని పార్టీలో మరో వర్గం వాదిస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకుడొకరు ఉద్దేశపూర్వకంగా తళి నియోజకవర్గంలో అసమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేశారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో కెలమంగలం సమితి బీజేపీ కార్యాలయానికి అద్దె చెల్లింపు ఖర్చులకు కూడా డబ్బులేదని గత మూడు రోజులుగా కెలమంగలం సమితి బీజేపీ కార్యాలయాన్ని మూసివేశారు. కెలమంగలం సమితిలో భారతీయ జనతాపార్టీలో అసమ్మతి రాగాలు జోరందుకోవడంతో జిల్లాలో పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు మునిరాజు పరిస్థితిని చక్కదిద్దకపోతే బీజేపీ తళి నియోజవర్గంలో గడ్డుపరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందంటున్నారు. -
మహిళపై అత్యాచారానికి యత్నించిన యువకులకు దేహశుద్ధి
కృష్ణగిరి (కర్నూలు) : ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడబోతుండగా గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని కడారికుంట గ్రామశివార్లలో శనివారం చోటుచేసుకుంది. మహిళ ఒంటరిగా వెళ్తుండటం చూసి మద్యం తాగిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించి అత్యాచారం చేయబోయారు. అదే సమయంలో అటువైపు ఆటోలో వెళ్తున్న కడారికుంట గ్రామస్తులు ఇది గమనించి.. యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన యువకులంతా డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన వారు. వీరిలో ఒకరు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్నట్లు సమాచారం. -
తెలుగుకు ఆదరణ కరువు
హొసూరు:తమిళనాడులో తెలుగు భాషకు రోజురోజుకూ ఆదరణ కరువైతుంది. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఉన్న క్రిష్ణగిరి జిల్లాలో తెలుగు భాష నిరాదరణకు గురవుతోంది. గతంలో క్రిష్ణగిరి జిల్లాలో తెలుగు పాఠశాలలు, తెలుగు బోర్డులు దర్శనమిచ్చేవి. 2006న తమిళనాడులో నిర్బంద తమిళభాషా చట్టం అమలుతో తెలుగు బోర్డులు కనుమరుగైపోతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా తెలుగులో కరపత్రాలు వేయడంలో అశ్రద్ద చూపుతున్నాయి. గ్రామ పండుగలలో భక్తులు ప్లెక్సీలు కూడా తమిళంలోనే వేస్తున్నారు. క్రిష్ణగిరి జిల్లాలో ఒకప్పుడు తెలుగు భాష అన్ని చోట్ల అలరాలుతుండేదని, ప్రస్తుతం తెలుగు బోర్డులు, తెలుగు అక్షరాలు కనుమరుగైతున్నాయని తెలుగు సంఘాలు, తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలలోని తెలుగు వారు పార్టీ కార్యకలాపాలు తెలుగులో కరపత్రాల ద్వారా తెలుగు వారికి తెలియజేయాలని, అన్ని రాజకీయ పార్టీలలోని తెలుగు వారు ఈ విషయంపై శ్రద్ద వహించాలని తెలుగు సంఘాల నాయకులు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు స్థానిక భాషల్లో ప్రభుత్వ పనులు తెలియాలని స్పష్టంగా సూచిస్తున్నా అధికార్లు పట్టించుకోలేదని తెలుగు సంఘాలు ఆరోపిస్తున్నారు. తెలుగు వారు ఐఖ్యమత్యంతో తెలుగు భాషా, సంస్కృతులను కాపాడుకోవాలని తెలుగు సంఘ నాయకులు వేర్వేరుగా అభిప్రాయాలను తెలియజేశారు. -
క్రిష్ణగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
తమిళనాడు ఐఏఎస్ అధికారి, సబ్ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు మృతి హొసూరు: జిల్లా కేంద్రమైన క్రిష్ణగిరి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక పథకాల అమలు శాఖ ప్రధాన కార్యదర్శి సహా ముగ్గురు మతిృచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. వివరాలు.. తమిళనాడు రాష్ర్ట ప్రత్యేక పథకాల అమలు శాఖ ప్రధాన కార్యదర్శి చాందినీకపూర్(55) బంధువులతో కలిసి చెన్నై నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరారు. క్రిష్ణగిరి పట్టణ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి.. పక్కనున్న రోడ్డుపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న వ్యానును ఢీకొంది. అనంతరం రోడ్డు పక్కనున్న డివైడర్ మీదుగా దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారును చెన్నైలోని అన్నానగర్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎక్సైజ్) సెల్వరాజ్ నడుపుతున్నారు. ప్రమాదంలో చాందినికపూర్, ఇతని బావమరిది (చెల్లి భర్త) రిచర్డ్‌సిృ్ట (48), సెల్వరాజ్ అక్కడికక్కడే మతిృచెందారు. చాందినీకపూర్ చెల్లెలు పెట్రిసియ (45), ఈమె కూతురు క్రిష్ణిన (20) తీవ్రంగా గాయపడ్డారు. టైరు పగిలినందునే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి గురై ఆగిఉన్న వ్యానును మరో కారు ఢీ కొంది. ఇందులో ప్రయాణిస్తున్న కాంట్రాక్టర్ సతీష్, మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు జూజువాడి నుంచి తిరుపత్తూరుకు వెళ్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకుని కలెక్టర్ టీపీ రాజేష్, ఎస్పీ కణ్ణమ్మాళ్ సంఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకొన్న మతృులను బయటకు తీసి క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు రెండు గంటల పాటు అంతరాయం కలిగింది. కేసు దర్యాప్తులో ఉంది. -
గ్రూప్ రాజకీయాలపై అన్నాడీఎంకే సీరియస్
హెచ్చరించి పంపిన అధిష్టానం హొసూరు : క్రిష్ణగిరి జిల్లాలో అధికార అన్నాడీఎంకే పార్టీలో గ్రూప్ రాజకీయాలపై అధిష్టాన వర్గం సీరియస్ అయ్యింది. క్రిష్ణగిరి మున్సిపాలిటీలో గత 28న జరిగిన మున్సిపల్ సమావేశంలో అన్నాడీఎంకే కౌన్సిలర్లు ముష్టియుద్ధానికి దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై అధిష్టాన వర్గం సూచనల మేరకు చెన్నైలో క్రమశిక్షణ కమిటీ క్రిష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు, వైస్ చైర్మన్ వెంకటాచలంను, అన్నాడీఎంకే కౌన్సిలర్లను సోమవారం రప్పించి చెన్నైలో విచారణ జరిపింది. ఈ సంఘటనపై ఈ రెండు వర్గాల మద్య రాతపూర్వక వివరణ కోరింది. మున్సిపాలిటీ సమావేశంలో జరిగే సంఘటనలకు మున్సిపల్ చైర్మన్‌దే బాధ్యత అని, కౌన్సిలర్లను అనుసరించి ప్రవర్తించాలని సూచించింది. అంతే కాక పార్టీలో గ్రూపు రాజకీయాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు నత్తం విశ్వనాథం, వైద్యలింగం, పళణిస్వామి, పళణియప్పన్‌లు ఇరువర్గాలను తీవ్రంగా హెచ్చరించి ఇది చివరి సారిగా ఉండాలని సూచించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అన్నాడీఎంకే కౌన్సిలర్ తెలిపారు. -
సీపీఐ రామకృష్ణ మేనల్లుడి దారుణ హత్య
కర్నూలు : కర్నూలు జిల్లా కృష్ణగిరిలో పెట్రోల్ బంక్ యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. బంక్ నుంచి డబ్బుతో ఇంటికి వెళుతుండగా అతడిపై వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. అనంతరం నగదుతో పరారయ్యారు. మృతుడు గొల్ల జలచంద్రుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మేనల్లుడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తమిళనాడులో కీచకం
ప్రేమికుడిని చితక్కొట్టి యువతిపై గ్యాంగ్‌రేప్ కృష్ణగిరి(తమిళనాడు): దేశంలో మృగాళ్ల ఘాతుకాలకు తెరపడడం లేదు. కోర్టులు శిక్షలు వేస్తున్నా, ప్రభుత్వాలు ‘నిర్భయ’ లాంటి కఠిన చట్టాలు తెస్తున్నా అబలలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో నలుగురు కామాంధులు ఓ కళాశాల విద్యార్థినిపై శుక్రవారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(19) కృష్ణగిరిలోని కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతోంది. కావేరి పట్టణ సమీపం గ్రామానికి చెందిన ప్రేమికుడి(24)తో శుక్రవారం సాయంత్రం కారులో రాయకోట సమీపంలోని బోడంపట్టికి వెళ్లింది. అక్కడ రాయకోట హెచ్చంపట్టికి చెందిన సుబ్రమణి(28), రాఘవేంద్రనగర్‌కు చెందిన ప్రకాష్(24), రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మణి(22), గిడ్డం బట్టికి చెందిన ప్రకాశ్(24) అనే నలుగురు యువకులు ఆ జంటపై దాడిచేశారు. యువకుడిని చితక్కొట్టారు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఫొటోలు తీసుకున్నారు. ఎవరికైనా చెబితే వాటిని బయట పెడతామని బెదిరించారు. ఈ ఘోరాన్ని చూసిన ఓ పశువుల కాపరి బోడంపట్టి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. గ్రామస్తులు అక్కడికొచ్చేలోగా నిందితులు పారిపోయారు. పోలీసులు శుక్రవారం రాత్రే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో పెల్లుబికిన ఆగ్రహం: బెంగళూరులో ఇటీవల ఓ స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం పట్ల నగర ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. శనివారం బాలిక తల్లిదండ్రులతోపాటు వందలాది విద్యార్థులు, తల్లిందడ్రులు, ప్రజలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దారుణానికి పాల్పడిన వారిని శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.