కర్నూలు : కర్నూలు జిల్లా కృష్ణగిరిలో పెట్రోల్ బంక్ యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. బంక్ నుంచి డబ్బుతో ఇంటికి వెళుతుండగా అతడిపై వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. అనంతరం నగదుతో పరారయ్యారు. మృతుడు గొల్ల జలచంద్రుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మేనల్లుడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీపీఐ రామకృష్ణ మేనల్లుడి దారుణ హత్య
Published Thu, Sep 11 2014 9:10 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement