భార్య, అత్తపై పెట్రోల్ తో దాడి:ఆపై ఆత్మహత్య | Man pours petrol on wife, and mother in law, sets them alight | Sakshi
Sakshi News home page

భార్య, అత్తపై పెట్రోల్ తో దాడి:ఆపై ఆత్మహత్య

Published Sun, Jun 29 2014 1:09 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

Man pours petrol on wife, and mother in law, sets them alight

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దారుణం జరిగింది. అనుమానంతో భార్యపై పెట్రోల్‌పోసి నిప్పుపెట్టాడు. అదే సమయంలో అక్కడున్న అత్తపై కూడా పెట్రోల్‌పోసి తగలబెట్టాడు. ఆ తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు వంగాయగూడెం మహేశ్వరీకాలనీకి చెందిన శివనారాయణ రోజు వారీకూలి.  కొద్దిరోజులుగా శివనారాయణ, అతని భార్య లక్ష్మి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా వీరి మధ్య వాగ్వివాదం జరిగింది.

 

అది కాస్తా పెద్దదికావటంతో తాగిన మైకంలో వున్న శివనారాయణ, భార్య లక్ష్మి, అక్కడేవున్న అత్త సత్తెమ్మపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తరువాత... భర్త శివనారాయణ కూడా పెట్రోల్‌పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో తీవ్రగాయాలైన వీరిలో భార్య, అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement