
క్రిష్ణగిరి (కర్ణాటక): వరుసకు సోదరుడు అయ్యే బాలునితో ప్రేమ వద్దని మందలించగా బాలిక ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కార్మికుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నల్గురు పిల్లలు. రెండవ భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భార్య నాలుగవ కూతురు(16), రెండవ భార్య 16 ఏళ్ల కుమారుని మధ్య ప్రేమాయణం మొదలైంది. విషయం తెలిసిన పెద్దలు మందలించడంతో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి మహిళా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (కీచక హెచ్‌ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment