
రంజిత్ మృతదేహం , తన ప్రియురాలితో రంజిత్ (ఫైల్)
దొడ్డబళ్లాపురం/గౌరిబిదనూరు: ఫేస్‌బుక్ ప్రేమ వైఫల్యంతో ఆత్మహత్య చేసుకున్న రంజిత్‌కుమార్ కేసులో గౌరిబిదనూరు పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. గౌరిబిదనూరులోని నెహ్రూ నగర్‌లో నివసిస్తున్న రంజిత్‌కుమార్ (24) అనే యువకుడు తన ప్రేమ వైఫల్యంపై సెల్‌ఫోన్‌లో మరణ వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేసి శనివారం ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆవేదన తట్టుకోలేక ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.
అతని ప్రియురాలు, హిందూపురం తాలూకా మేళాపురానికి చెందిన ఒక డిగ్రీ విద్యార్థిని (20), ఆమె సోదరుడు నిఖిల్ తనను అన్ని విధాలా మోసగించారని, వారిని శిక్షించాలని ఫేస్‌బుక్ వీడియోలో కోరుతూ ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రియురాలు, ఆమె అన్న కోసం పోలీసులు ఆరా తీయగా పరారీలో ఉన్నట్లు తేలింది. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment