వామ్మో.. ఎన్ని పాము పిల్లలు | Family Finds 66 Baby Snakes, eggs Under House in Kurnool District | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఇంట్లో పాము పిల్లలు

Published Thu, Mar 5 2020 3:48 PM | Last Updated on Thu, Mar 5 2020 5:26 PM

Family Finds 66 Baby Snakes, eggs Under House in Kurnool District - Sakshi

సాక్షి, కృష్ణగిరి: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలొం అమకతాడు గ్రామంలోని ఓ ఇంట్లో పాములు కలకలం​ రేపాయి. ఇంటి మెట్ల కింద ఏకంగా 66 పాము పిల్లలు, 80కి పైగా పాము గుడ్లు ఉండటంతో ఆ ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారు. ఈ విషయం మంగళవారం రాత్రి వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తలారి శేషన్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు మెట్లపై కూర్చుని మాట్లాడుకునేవారు.  ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఒక పాము పిల్ల ఇంటి ముందు కనిపించింది. బయటి నుంచి వచ్చిందనుకుని దాన్ని చంపేశారు. మంగళవారం మెట్ల కింద రంధ్రం కనిపించడంతో అనుమానంతో దానిలోకి పొగ పెట్టారు. దీంతో ఒక్కొక్కటిగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. చివరకు మెట్లను పూర్తిగా పెకిలించి చూడగా... అందులో 66 నాగుపాము, జర్రిపోతు పిల్లలు, 80 దాకా పాము గుడ్లు కనిపించాయి. గ్రామస్తులు పాము పిల్లలను చంపేసి, గుడ్లను ధ్వంసం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement