మహబూబ్‌నగర్:
భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మహ్మద్ లతీఫ్, అతని కుటుంబీకులు, బంధువులతో కలిసి కారులో వెళ్తుండగా జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో మహ్మద్ లతీఫ్ అక్కడికక్కడే మృతిచెందారు. అతని భార్య, ఇద్దరు కుమారులతోపాటూ మరో ముగ్గురు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు కేరళ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కారు బోల్తా: ఒకరు మృతి
Published Fri, Sep 22 2017 8:56 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM
Advertisement
Advertisement