నిజామాబాద్ (ఎడపల్లి) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బషీర్‌ఫాం వద్ద శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ ఓ ఆటో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా బోధన్ మండలం రాకాసిపేటకు చెందినవారు.