
ముంబై : షాహిద్ కపూర్,కియారా అద్వానీలు జంటగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ కబీర్ సింగ్ వసూళ్ల వర్షం కొనసాగుతోంది. తెలుగు మూవీ అర్జున్ రెడ్డి రీమేక్‌గా రూపొందిన కబీర్ సింగ్ వివాదాల మాటెలా ఉన్నా కలెక్షన్లలో మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 11 రోజుల్లో కబీర్ సింగ్ రూ 206.48 కోట్లు వసూలు చేసినట్టు ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
కబీర్‌సింగ్ ఈజ్ 200 నాటౌట్ అని ఆయన రోజూ వారీ వసూళ్ల బ్రేకప్‌ను వివరించారు. వీక్ డేస్‌లోనూ కబీర్ సింగ్ హవా ఏమాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ గణాంకాలను వెల్లడిస్తూ తెలిపారు. మరోవైపు సినిమాను బ్లాక్‌బస్టర్ చేశారంటూ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ షాహిద్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment