
విమర్శకులు ‘కబీర్ సింగ్’ను వేలెత్తి చూపిస్తున్నా కలెక్షన్స్‌లో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్‌హిట్‌గా నిలిచిన కబీర్ సింగ్.. త్వరలోనే రెండు వందల కోట్లను కలెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 170కోట్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీల నటనకు ప్రశంసలు లభించాయి.
అయితే ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు విజయ్ దేవరకొండ.. కబీర్‌సింగ్‌కు కంగ్రాట్స్ చెబుతూ కియారా అద్వాణీకి ఓ గిఫ్ట్‌ను ప్రజెంట్ చేశాడు. ఆ గిఫ్ట్‌ను కియారా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘కబీర్ సింగ్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ కియారా.. ఈ విజయాన్ని ఎంజాయ్ చేయ్.. నా ఆనందంతో పాటు.. నా బట్టలను పంపుతున్నాను.. ఇలా అంటే ఏదో తప్పులా వినిపిస్తుంది కదా.. నా బ్రాండ్ దుస్తులను పంపాను’ అని తెలిపాడు. ఈ విషయాన్ని కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘థ్యాంక్యూ అర్జున్’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment