
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆగస్టు25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక లైగర్ షూటింగ్ అనంతరం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా ప్రస్తుతం రామ్‌చరణ్‌తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం విజయ్‌తో ఈ బ్యూటీ జోడీ కట్టనుంది. చదవండి: త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్
Comments
Please login to add a commentAdd a comment