షాహిద్ కపూర్
రెండు రోజులుగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అవి కంగ్రాట్స్ కాల్స్. షాహిద్ కపూర్ రెండో సారి తండ్రి అయినందుకు సన్నిహితులు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరా రాజ్‌పు త్‌ను మూడేళ్ల క్రితం షాహిద్ కపూర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఆల్రెడీ మిషా కపూర్ అనే కుమార్తె ఉంది. ఇప్పుడు తాజాగా మీరా రాజ్‌పుత్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బాబుకి జైన్ కపూర్ అని పేరు పెట్టినట్లు షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘‘మా బేబీ బాయ్‌కి జైన్ కపూర్ అని పేరు పెట్టాం. ఇద్దరు పిల్లలు చాలు అనుకుంటున్నాం. మాకు విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు షాహిద్.
Comments
Please login to add a commentAdd a comment