అలాంటి కోడలినే నేను ఎప్పుడూ కోరుకున్నా
ముంబయి: తన కుమారుడు షాహిద్ కపూర్కు మీరా రాజ్పుత్ భార్యగా రావడం గొప్ప సంతోషాన్నిచ్చిందని షాహిద్ తల్లి నీలిమ అజీం అన్నారు. అలాంటి అమ్మాయే తనకుమారుడికి కావాలని ఎప్పుడూ కోరుకున్నానని చెప్పారు. ఇటీవల పెళ్లి చేసుకున్న షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్ల రిసెప్షన్ ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్, అర్జున్ కపూర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా షాహిద్ తల్లి నీలిమ మాట్లాడుతూ మీరాను షాహిద్ తన భార్యగా ఎంచుకోవడం గొప్ప నిర్ణయమని అన్నారు. అలాంటి కోడలినే తాను ఎప్పుడూ కోరుకునేదాన్నని చెప్పారు. ఆమె మంచి సహృదయశీలి అని చెప్పారు. ప్రేమాప్యాయతలు నిండుగా ఉన్న గొప్ప కుటుంబం నుంచి మీరా వచ్చిందని, అలాంటి అమ్మాయిని కూతురుగా పొందడం కూడా అదృష్టమేనని చెప్పారు.