పద్మావతిపై పరదా... తీసేది ఎప్పుడు? | Sanjay Leela Bhansali's 'Padmavati' release to be postponed | Sakshi

పద్మావతిపై పరదా... తీసేది ఎప్పుడు?

Nov 20 2017 12:23 AM | Updated on Nov 20 2017 8:44 AM

Sanjay Leela Bhansali's 'Padmavati' release to be postponed  - Sakshi - Sakshi

నెగ్గిందెవరు? ఓడిందెవరు? అనేది ఇంపార్టెంట్‌ కాదిక్కడ! కానీ, ప్రతి ఒక్కరూ ఊహించినట్టే జరిగింది. ‘పద్మావతి’ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్టు డిసెంబర్‌ 1న చిత్రాన్ని విడుదల చేయడం లేదు. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తీసిన ఈ చారిత్రక గాథ... చిత్రీకరణ దశ నుంచి పలు వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందు అవన్నీ ముదిరి పాకాన పడడంతో రచ్చ రచ్చ జరుగుతోంది. దాంతో చిత్రబృందమే ‘పద్మావతి’పై పరదా వేసింది. మరి, ప్రేక్షకులకు చిత్రాన్ని ఎప్పుడు చూపిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

చిత్రనిర్మాణ సంస్థలలో ఒకటైన వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ ‘పద్మావతి’ విడుదలను వాయిదా వేస్తున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రాణీ పద్మిని కథ ఆధారంగా దీపికా పదుకొనె, షాహిద్‌ కపూర్, రణవీర్‌ సింగ్‌ ముఖ్య తారలుగా సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా ఆన్‌ సెట్స్‌లో ఉన్నప్పుడే చరిత్రను వక్రీకరించారంటూ రాజ్‌పుత్‌ కర్ణి సేనలు ఆరోపణలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అటువంటిది ఏమీ లేదని దర్శకుడు చెబుతున్నారు. మరి, విడుదల ఎందుకు వాయిదా వేశారో? బీటౌన్‌లో ఏం జరుగుతుందో? వెయిట్‌ అండ్‌ సీ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement