రాణీ పద్మిని గొప్ప అందగత్తె. ఆమె మనోహరమైన రూపం పలు దేశాల రాజులను ఆకట్టుకుంటుంది. పద్మినిని దక్కించుకోవాలనే కాంక్షతో ఆమె రాజ్యంపై దండెత్తుతారు. ఇంతకీ పద్మిని పెళ్లి కాని అమ్మాయా? అంటే కాదు. ఆల్రెడీ పెళ్లయిపోతుంది. అయినా ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటారు. యుద్ధంలో పద్మిని భర్త చనిపోతాడు. ఆ తర్వాత శత్రుదేశాల రాజుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి పద్మిని ఏం చేసింది? కాపాడుకోలేని పరిస్థితుల్లో ఎలా ప్రాణత్యాగం చేసిందన్నది రాణీ పద్మిని చరిత్ర.
13–14వ శతాబ్దానికి చెందిన ఈ భారతీయ రాణి జీవిత కథ నేపథ్యంలో ‘పద్మావతి’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. రాణి పాత్రను దీపికా పదుకొనె పోషిస్తున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకుడు. ఇందులో రాణి భర్త రావల్ రతన్ సింగ్ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తుండగా, శత్రుదేశం రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను రణవీర్ సింగ్ చేస్తున్నారు. ఇంకా పలువురు ప్రముఖ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈలోపు దీపిక లుక్‌ని విడుదల చేశారు. ‘‘నవరాత్రుల సందర్భంగా ఛిత్తోడ్ మహారాణి పద్మావతిని చూడండి’’ అని తన లుక్‌ని విడుదల చేశారు దీపిక. రాణి బాగుంది కదూ!
పద్మావతి బాగుందా?
Published Fri, Sep 22 2017 12:03 AM | Last Updated on Fri, Sep 22 2017 11:22 AM
Advertisement