
సాక్షి, ముంబై: సినిమా ప్రపంచంలో హాట్ టాపిక్ గా నిలిచిన ‘పద్మావతి’ చిత్రం సుప్రీం భారీ ఊరట అందించడంతో శరవేగంగా కదులుతోంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్రంలోని రెండవ పాటను రిలీజ్ చేసింది. రిలీజ్‌కుముందే ఈ సినిమాను చుట్టుముట్టిన పలు వివాదాలు భారీ హైప్ ను క్రియేట్ చేయగా.. చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన మొదటిపాటకు మంచి ఆదరణ లభించింది. అంతేకాదు సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా బాలీవుడ్ అవార్డు హీరోయిన్ దీపాకా పడుకోన్ అత్యద్భుతంగా రొమాన్స్ పండిస్తున్న ఈ రెండవ పాటతో ఈ సినిమాపై మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. కెమెరా వర్క్ తో పాటు ఆర్ట్ డైరెక్షన్ కూడా అదరహో అని సినీ విమర్శకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా పద్మావతి మూవీని అడ్డుకుంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీమ్ కోర్టు తోసిపుచ్చడంతో జోష్‌గా ఉన్న చిత్రం తాజా ‘ఏక్ దిల్.. ఏక్‌జాన్’ పాటలను విడుదల చేసింది. అటు ఈ చిత్ర కథానాయిక దీపికా పదుకోన్ ట్విట్టర్‌లో చారిత్రక ప్రేమ గానమంటూ ట్విట్టర్‌లో ఈ పాటను షేర్ చేశారు. కాగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మావతి చిత్రం డిసెంబర్ 1న థియేటర్లను పలకరించనుంది.
An epic love ballad...❤️ #EkDilEkJaan @FilmPadmavati https://t.co/hEHhcVXyu8
— Deepika Padukone (@deepikapadukone) November 11, 2017
Comments
Please login to add a commentAdd a comment