
న్యూఢిల్లీ : బాలీవుడ్ సెలబ్రిటీల కూతుళ్లతో స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తీసుకున్న సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల బాలీవుడ్ మూవీ పద్మావతి ట్రైలర్ విడుదల కాగా, సక్సెస్ ను దీపికా పదుకొనేతో కలిసి ఇండస్ట్రీకి సంబంధించిన సన్నిహితులు శనివారం రాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో దర్శకనిర్మాత కరణ్ జోహర్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి ఫోజులిస్తూ చాలా సెల్ఫీలు దిగారు.
ఇందుకు సంబంధించిన ఓ సెల్ఫీని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కరణ్ పోస్ట్ చేయగా భారీ లైక్స్, కామెంట్లతో దూసుకుపోతుంది. పద్మావతి హీరో రణవీర్ సింగ్, జాన్వీ, సారాలతో కలిసి దిగిన మరో ఫొటోలను షేర్ చేయగా అది కూడా వైరల్ అయింది. సైరత్ రీమేక్ లో శ్రీదేవి కూతురు జాన్విని కరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు. సైఫ్-అమృతాసింగ్ ల ముద్దుల తనయ సారా 'కేదార్‌నాథ్' తో తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. కానీ ఫస్ట్ సినిమాకు ముందు ఫ్యాషన్ తో పాటు పార్టీలు, ఇతరత్రా కారణాలతో ఈ బ్యూటీ క్వీన్స్ పాపులర్ అయిపోతున్నారు.
సారా అలీ ఖాన్(బ్లాక్ టాప్), జాన్వీ కపూర్(పర్పుల్), రణవీర్ సింగ్‌లతో స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్(చివర్లో)
Comments
Please login to add a commentAdd a comment