సాక్షి, హుజురాబాద్: ఉప ఎన్నికల్లో ఓటమి బాధ కలిగించిందని హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి అన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. హుజూర్‌నగర్ ఓటు, నియంతృత్వ కేసీఆర్ పాలనకు ప్రశ్నగా మారుతుందనుకున్నామని వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నియంతృత్వ పాలన అంతం కావాలని అందరూ అనుకున్నారని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను మోసుకుంటూ అభ్యర్థిగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. తమ ఆకాంక్షను హుజురాబాద్ ఉప ఎన్నిక ద్వారా తెలియజెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని చెప్పారు. వ్యక్తిగతంగా హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.