
సినిమాకు 12 కోట్లు అడుగుతుందట..!
ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు దీపికా పదుకొనే. బాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటి, హాలీవుడ్లో సైతం సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ట్రిపులెక్స్ సీరీస్తో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది దీపిక. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మరో బాలీవుడ్ మూవీలోనూ నటిస్తోంది.
హాలీవుడ్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటి.. ఇప్పుడు బాలీవుడ్లో సినిమా అంగీకరించాలంటే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. ఇన్నాళ్లు పది కోట్ల లోపు రెమ్యూనరేషన్ అందుకున్న దీపిక ఇప్పుడు ఏకంగా 12 కోట్లు అడుగుతుందట. ముఖ్యంగా తన సినిమాలకు ఓవర్ సీస్లో కూడా మంచి మార్కెట్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇంత భారీగా డిమాండ్ చేస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ఇప్పటికే అంగీకరించిన పద్మావతి సినిమాకు సైతం అదే రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఈ బ్యూటి. దీపిక డిమాండ్ చేస్తున్న మొత్తం బాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు అందుకుంటున్న దాని కంటే కూడా చాలా ఎక్కువని భావిస్తున్న దర్శక నిర్మాతలు, దీపికకు బదులుగా వేరే హీరోయిన్స్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.