'జవాన్' సినిమా పేరు చెప్పగానే అందరికీ వందల కోట్ల కలెక్షన్సే గుర్తొస్తాయి. ఎందుకంటే గత వారం రిలీజైన ఈ చిత్రం.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీలో షారుక్‌తోపాటు బోలెడంత మంది స్టార్స్ నటించారు. అయితే మిగతా వాళ్లు కోట్లకు కోట్లు తీసుకున్నారు. కానీ ఇందులో యాక్ట్ చేసిన దీపికా పదుకొణె మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకో తెలుసా?
తనకు జరిగిన అన్యాయంపై ఓ జవాన్.. తన కొడుకుతో కలిసి విలన్‌పై ఎలా పగతీర్చుకున్నాడు? అనే కాన్సెప్ట్‌తో తీసిన 'జవాన్' సినిమాని ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీశారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇకపోతే ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో షారుక్‌కి జోడీగా దీపికా పదుకొణె యాక్ట్ చేసింది.
(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!)
సాధారణంగా ఒక్కో సినిమాకు దీపికా పదుకొణె.. రూ.12-15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటదని టాక్. అలాంటిది 'జవాన్'లో ఉచితంగా నటించినట్లు స్వయంగా ఆమెనే క్లారిటీ ఇచ్చింది. ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉండటంతో ఇంకేం ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. అయితే ఈమె కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన మూవీ 'ఓం శాంతి ఓం'. ఈ చిత్రం నుంచి షారుక్, నిర్మాణ సంస్థతో దీపికకు మంచి బాండింగ్ ఉంది. బహుశా ఈ కారణంతోనే ఫ్రీగా యాక్ట్ చేసి ఉండొచ్చు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ K' అలియాస్ 'కల్కి'లో హీరోయిన్‌గా చేస్తోంది దీపికనే. అయితే గతంలో తన భర్త రణ్‌వీర్ సింగ్ 83, సర్కస్ సినిమాల్లోనూ గెస్ట్ రోల్స్ చేసిన దీపికా.. అప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పుడు 'జవాన్'కి మాత్రం ఫ్రీగా చేసింది. మరి ఇది విశేషమేగా!
(ఇదీ చదవండి: అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!)
Comments
Please login to add a commentAdd a comment