బాలీవుడ్ బ్యాటీ దీపిక పదుకొణే ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. నటనలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన దీపిక.. రెమ్యూనరేషన్ విషయంలోనూ ట్రెండ్ సెట్‌చేస్తోంది. బీ టౌన్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్‌లో టాప్‌లో ఉన్న బ్యూటీ.. ఆ రేసులో తనకు సాటిలేదని నిరూపిస్తోంది. తాజాగా ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్ సహనిర్మాతలు వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. (రాజుకు తగ్గ రాణి)
ఈ విషయం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభాస్‌తో చిత్రానికి దీపిక తీసుకోబోయే రెమ్యూనరేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ఈ బ్యూటీ మొదటి చిత్రానికి దాదాపు 20 నుంచి 30 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. దీపిక పారితోషకం సోషల్ మీడియా, చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే సాధారణంగా తన సినిమాకు 13-15కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే దీపికా పదుకొనే… ప్రభాస్ తో సినిమాకు మాత్రం ఏకంగా 20కోట్లుకు పైనే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి నిర్మాత సానుకూలంగానే స్పందించటంతో దీపికా సినిమాకు అంగీకరించినట్లు ఫిలింనగర్ లో ప్రచారం సాగుతోంది. ఈ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇప్పటివరకు మన దేశంలోనే ఏ హీరోయిన్కు ఇవ్వలేదని సమాచారం.
మొదటి చిత్రానికి 20 కోట్లు, రెండో చిత్రానికి 50 కోట్లు చొప్పున బడ్జెట్‌తో సినిమాలను తెరకెచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ దాదాపు 400 కోట్లతో ప్రభాస్ సినిమాను తెరకెక్కించేందుకు స్ర్కిప్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇక బాహుబలి హిట్స్‌తో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకున్న యంగ్ రెబల్ స్టార్ టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. అంతేకాకుండా ప్రభాస్‌తో సినిమా అనగానే దర్శక నిర్మాతలకు ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తోందని, బడ్జెట్ ఎంత పెట్టడానికైనా వెనకడటంలేదని టాప్ వినిపిస్తోంది. కాగా ప్రభాస్-దీపిక చిత్రం సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
హాట్ టాపిక్‌గా మారిన దీపిక రెమ్యూనరేషన్
Published Sat, Jul 25 2020 10:48 AM | Last Updated on Sat, Jul 25 2020 1:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment