నో కాంప్రమైజ్‌ | Deepika Padukone does NOT compromise on fees | Sakshi
Sakshi News home page

నో కాంప్రమైజ్‌

Published Sun, Jan 20 2019 2:18 AM | Last Updated on Sun, Jan 20 2019 2:18 AM

Deepika Padukone does NOT compromise on fees - Sakshi

దీపికా పదుకోన్‌

స్క్రిప్ట్‌ నచ్చినా పారితోషికం దగ్గర కాంప్రమైజ్‌ కానంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌. అవసరమైతే ఆ సినిమా చాన్స్‌ను వదులుకోవడానికి కూడా సిద్ధం అంటున్నారామె. ఈ విషయం గురించి తను ఎదుర్కొన్న ఓ సంఘటనను షేర్‌ చేశారు దీపికా. ‘‘ఇటీవల ఓ దర్శకుడు నాకు ఓ కథ చెప్పారు. క్రియేటివ్‌ యాంగిల్‌లో ఆ సినిమా నాకు నచ్చింది. ఆ తర్వాత రెమ్యూనరేషన్‌ డిస్కషన్స్‌ స్టార్ట్‌ చేశాం. నా మాట చెప్పాను. ఆ డైరెక్టర్‌ వెళ్లిపోయి మరలా రెండు రోజుల తర్వాత వచ్చారు. మెయిన్‌ లీడ్‌ యాక్టర్‌ కన్నా నాకు ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇప్పించలేనని తన అభిప్రాయం చెప్పారు. సినిమా చేయనని నేను చెప్పేశాను.

ఎందుకంటే నా విలువ నాకు తెలుసు. నా ట్రాక్‌ రికార్డ్‌పై నాకు అవగాహన ఉంది. ఆ సినిమాను వద్దనుకున్నందుకు కూడా బాధపడటం లేదు. నేటి రోజుల్లో సినిమాల్లో మహిళల అవకాశాలకు కొదవ లేదు. మహిళల పాత్రలకు కూడా ప్రాముఖ్యత పెరిగింది. ఓ మార్పు వస్తోంది’’ అని చెప్పుకొచ్చారు దీపికా. ‘పద్మావత్‌’ సినిమా సక్సెస్‌తో బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా ఎంటో నిరూపించుకున్న దీపికా ప్రస్తుతం ‘చెప్పాక్‌’ అనే సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. ‘రాజీ’ ఫేమ్‌ మేఘనా గుల్జార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అదేవిధంగా ఓ సూపర్‌ ఉమెన్‌ సినిమాలో కూడా నటించబోతున్నట్లు ఓ సందర్భంలో దీపిక చెప్పిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement