పద్మావతికి జోడి దొరకట్లేదు | Sharukh, Ranaveer Rejected Padmavathi | Sakshi
Sakshi News home page

పద్మావతికి జోడి దొరకట్లేదు

Published Wed, Aug 17 2016 12:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

పద్మావతికి జోడి దొరకట్లేదు

పద్మావతికి జోడి దొరకట్లేదు

బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం పద్మావతి. ఇప్పటికే ఈ సినిమాలో టైటిల్ రోల్కు బాలీవుడ్ బ్యూటి దీపిక పదుకొనేను తీసుకోవాలని నిర్ణయించారు. అయితే దీపికకు జోడిగా ఎవరు నటిస్తారన్న విషయం మాత్రం ఇంత వరకు తేలటం లేదు. గతంలో సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో దీపికతో కలిసి నటించిన రణవీర్ సింగ్ను మరోసారి హీరోగా తీసుకోవాలని భావించినా., విభేదాల కారణంగా రణవీర్ ఎంపిక కుదరలేదు.

తరువాత బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్తో పద్మావతి సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర చేయించాలని భావించాడు.షా రూఖ్ కూడా ఈ ప్రాజెక్ట్పై ఇంట్రస్ట్ చూపించినా.. 200 రోజుల పాటు డేట్స్ ఇవ్వటం సాధ్యం కాదన్న ఉద్దేశంతో పద్మావతికి నో చెప్పేశాడు. ఇద్దరు స్టార్ హీరోలు కాదనటంతో ఇప్పుడు బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ను సంప్రదించే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. మరి హృతిక్ అయినా పద్మావతితో జత కట్టడానికి అంగీకరిస్తాడో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement