వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న పద్మావతి(70) అనే వృద్ధురాలిని రెండున్నర తులాల బంగారు గొలుసు కోసం ఆగంతకులు గొంతు నులిమి చంపేశారు. ఒంటరిగా నివసిస్తున్న పద్మావతిని ఆగంతకులు మొదటగా ఇటుక రాయితో తలపై మోదారు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారు.
చనిపోయిందనుకుని భ్రమపడిన ఆగంతకులు ఆమె మెడలోని గోలుసు తీసుకుని పరారయ్యారు. ఆదివారం ఉదయం ఆమె గొంతులో ప్రాణం ఉండటం గమనించిన స్థానికులు ... మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కాద్దిసేపటకే మరణించింది.