రెవెన్యూ ఉద్యోగులకు పింఛన్ యోగం | AP state government gives pension to Revenue employees | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ఉద్యోగులకు పింఛన్ యోగం

Published Wed, Nov 5 2014 1:44 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

AP state government gives pension to Revenue employees

సాక్షి, హైదరాబాద్: కనీస సర్వీసు లేని కారణంగా పింఛను పొందే అవకాశం కోల్పోయిన రెండు వేల మంది పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులకు పింఛను ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పెన్షన్ రూల్స్ సవరణ ఫైలుపై సీఎం చంద్రబాబు మంగళవారం ఆమోద ముద్ర వేశారు.

1992 నుంచి 2002 వరకు గౌరవ వేతనంపై పనిచేసిన గ్రామ పరిపాలనాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు తర్వాత స్కేలు పొందారు. అయితే వారు పదవీ విరమణ చేశాక కనీస సర్వీసు లేని కారణంగా పింఛను పొందే అవకాశం కోల్పోయారు. తాజాగా సీఎం నిర్ణయంతో రెండు వేల మందికి పింఛను రానుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement