సమష్టికృషితోనే అభివృద్ధి
– మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందండి
– అధికారులు,సిబ్బందికి కలెక్టర్ సూచన
– రెవెన్యూ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ
అనంతపురం అర్బన్ : ‘‘నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం. మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందుదాం‘‘ అని కలెక్టర్ కోన శశిధర్ ఉద్యోగులకు సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కలెక్టర్ శశిధర్‌ను, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం రూపొందించిన డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పనిచేసి 'అనంత'ను ఉన్నత స్థానంలో నిలపాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలైనప్పుఽడే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, డీఎఫ్‌ఓ రాజశేఖర్, సీపీఐ రామచంద్ర, ఆర్‌డీఓలు, రెవెన్యూ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షులు జయరామప్ప, రెవెన్యూ ఉద్యోగులు కల్చరల్, స్పోర్ట్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.