- ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు డిమాండ్
ఒంగోలు టౌన్ (ప్రకాసం జిల్లా) : రెవెన్యూ ఉద్యోగులను సాధారణ బదిలీల నుండి మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రెవెన్యూ ఉద్యోగుల బదిలీల్లో రిక్వస్ట్, పరస్పర అవగాహన కలిగిన వారిని మాత్రమే బదిలీ చేయాలని సూచించారు. సోమవారం ఒంగోలులోని రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం 57, 58, 60, 98ఇలా రకరకాల జీఓలు జారీ చేసిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ ప్రథమార్థంలో రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నందున ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల బదిలీలపై సానుకూలంగా స్పందించాలని, ఇదే విషయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు బొప్పరాజు వెల్లడించారు.
అందులో రెవెన్యూ ఉద్యోగులను మినహాయించాలి
Published Mon, Aug 10 2015 6:07 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement