![Prof K Nageshwar Speech At Telangana Revenue Employees Meeting - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/25/Prof-K-Nageshwar.jpg.webp?itok=fEadNHod)
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పని సంసృతి మారకపోతే ఇబ్బందులు తప్పవని మాజీ ఎమెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. గురువారం రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ.. వ్యవస్థ మారనంత వరకు రాజకీయ నాయకులు అధికారులపై పెత్తనం చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందంటే అది చూస్తున్న ముఖ్యమంత్రి కూడా బాధపడాలని వ్యాఖ్యానించారు. దేశంలో రాజకీయ అవినీతి అంతం కాకుండా ఉద్యోగుల అవినీతి నిర్మూలన అసాధ్యం అని తెలిపారు.
రాజకీయ అవినీతిని తొలగించకుండా ఉద్యోగులపై నెపం నెట్టే ప్రయత్నం సరికాదని సూచించారు. ఉద్యోగులపై దాడి ప్రభుత్వానికి మంచిది కాదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టకముందే రెవెన్యూ అధికారులు మీటింగ్ పెట్టి ఉంటే బాగుండేదిని అభిప్రాయపడ్డారు. అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయితీ, వ్యక్తిగత హితబోధ జరగాలని పేర్కొన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోషియేషన్ మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం శివశంకర్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల నుంచి రెవెన్యూ శాఖలో తప్పులు జరుగుతూ వస్తున్నాయని తెలిపారు. తమిళనాడు, రాజస్తాన్‌లలో ప్రతి గ్రామంలో రెవెన్యూ కార్యాలయం ఉందన్నారు. రెవెన్యూ యంత్రాంగంలో ఎలాంటి శిక్షణ ఉండదని అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో దళారులు ఎక్కువైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment