Professor K. Nageshwar
-
నాలుగుకోట్ల కుటుంబ పెద్ద కేసీఆర్నే ప్రజలు ఎంచుకుంటారు: కేటీఆర్
-
‘ఉద్యోగుల పని సంస్కృతి మారకపోతే ఇబ్బందులు తప్పవు’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పని సంసృతి మారకపోతే ఇబ్బందులు తప్పవని మాజీ ఎమెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. గురువారం రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ.. వ్యవస్థ మారనంత వరకు రాజకీయ నాయకులు అధికారులపై పెత్తనం చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందంటే అది చూస్తున్న ముఖ్యమంత్రి కూడా బాధపడాలని వ్యాఖ్యానించారు. దేశంలో రాజకీయ అవినీతి అంతం కాకుండా ఉద్యోగుల అవినీతి నిర్మూలన అసాధ్యం అని తెలిపారు. రాజకీయ అవినీతిని తొలగించకుండా ఉద్యోగులపై నెపం నెట్టే ప్రయత్నం సరికాదని సూచించారు. ఉద్యోగులపై దాడి ప్రభుత్వానికి మంచిది కాదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టకముందే రెవెన్యూ అధికారులు మీటింగ్ పెట్టి ఉంటే బాగుండేదిని అభిప్రాయపడ్డారు. అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయితీ, వ్యక్తిగత హితబోధ జరగాలని పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోషియేషన్ మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం శివశంకర్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల నుంచి రెవెన్యూ శాఖలో తప్పులు జరుగుతూ వస్తున్నాయని తెలిపారు. తమిళనాడు, రాజస్తాన్లలో ప్రతి గ్రామంలో రెవెన్యూ కార్యాలయం ఉందన్నారు. రెవెన్యూ యంత్రాంగంలో ఎలాంటి శిక్షణ ఉండదని అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో దళారులు ఎక్కువైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. -
వీసీలను నియమించే తీరిక లేదా
- మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కేయూ క్యాంపస్(వరంగల్ జిల్లా) తెలంగాణ లోని యూనివర్సిటీలకు వీసీలను నియమించే తీరిక రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రశ్నించారు. పీడిఎస్యూ రాష్ర్ట మహసభల సందర్భంగా ఆదివారం కాకతీయ యూనివ ర్సిటీ ఆడిటోరియంలో ‘విద్యారంగ పరిస్థితి - తెలంగాణ రాష్ట్రం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాక రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఉన్నత విద్యారంగం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాల్సిన యూనివర్సిటీ విద్య నానాటికి దిగజారుతోందని అన్నారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 500 పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉందని, అదికూడా స్థానిక ఉపాధ్యాయుల కృషితోనేనని తెలిపారు. రాష్ట్రంలో 19 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి తరగతి గదికి టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు గైర్హాజరు కూడా 20 శాతం వరకు ఉంటోందని, వారిలోనూ అంకితభావం కొరవడిందని అన్నారు. సదస్సులో పీడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ప్రసాద్, ఉపాధ్యక్షులు సత్య, ఎం.సుధాకర్, కార్యదర్శులు రాము ,శరత్, సరిత తదితరులు పాల్గొన్నారు.