టీమిండియా వెటరన్ పేసర్ సిద్దార్థ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిద్దార్డ్ కౌల్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో అమ్ముడుపోని తర్వాత కౌల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కౌల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత క్రికెట్ తరపున ఆడేందుకు అవకాశమిచ్చిన బీసీసీఐకి, తను ప్రాతినిథ్యం వహించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సిద్దార్ద్ ధన్యవాదాలు తెలిపాడు.
ఐర్లాండ్‌పై అరంగేట్రం..
కాగా పంజాబ్‌కు చెందిన సిద్దార్థ్ కౌల్ 2018లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాదిలో ఇంగ్లండ్‌పై వన్డే డెబ్యూ చేశాడు. కౌల్ చివరగా టీమిండియా తరపున 2019లో ఆడాడు.
భారత్ తరపున మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన కౌల్.. 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్‌హెచ్ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పంజాబీ పేసర్.. 29.98 సగటుతో 58 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment