విజయవాడ: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు దాడిని జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. ఎమ్మార్వోపై దాడికి నిరసనగా శుక్రవారం వివిధ ప్రాంతాలలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ముసునూరు మండలం నేలపాటివారికుంట సమీపంలోని రహదారిపై రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగి..బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే నందిగామ ఎమ్మార్వో కార్యాలయానికి రెవెన్యూ ఉద్యోగులు తాళాలు వేసి తమ నిరసన తెలిపారు.