అవినీతిని సహించేది లేదన్న సంకేతం ఇచ్చేందుకే పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులను బదిలీలు చేసినట్లు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ : అవినీతిని సహించేది లేదన్న సంకేతం ఇచ్చేందుకే పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులను బదిలీలు చేసినట్లు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. అధికారుల బదిలీల్లో ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్డీవోలను మూకుమ్మడిగా ఎందుకు బదిలీలు చేస్తున్నారంటూ రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం కేటీఆర్ను కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో పారదర్శకంగానే బదిలీలు చేశామన్నారు. పాత ప్రభుత్వాల మాదిరిగా వ్యవహరించలేదని ఆయన తెలిపారు. రాజకీయ అవినీతి అంతానికి కట్టుబడి ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు.