హోరాహోరీగా రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు రెండోరోజు హోరాహోరీగా సాగాయి. శనివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో కబడ్డీ, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, షటిల్, టెన్నికాయిట్ పోటీలను నిర్వహించారు. అన్ని విభాగాల్లోనూ కలెక్టరేట్ క్రీడాకారులు సత్తాను చాటారు. విజేతలుగా నిలిచారు. పురుషులతో సమానంగా క్రీడాకారిణులు కూడా సత్తాచాటారు.
నేడు ముగియనున్న పోటీలు
రెవెన్యూ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఆదివారం స్థానిక కృష్ణ కళా మందిరంలో జరగనున్నాయి. ముగింపు కార్యక్రమంలో క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరగనున్న రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ పోటీల్లో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పాల్గొననున్నారు. క్రికెట్ ఫైనల్ పోటీల్లో అనంతపురం రెవెన్యూ డివిజన్, కలెక్టరేట్ జట్లు తలపడనున్నాయి.
రెండోరోజు విజేతలు వీరే
క్యారమ్స్ డబుల్స్ విభాగంలో నిర్మల, ప్రమీల–విన్నర్స్
జ్యోతి, బాలమ్మ–రన్నర్స్ క్యారమ్స్ సింగల్స్ విభాగంలో
నిర్మల–విన్నర్, సుజాత–రన్నర్ , చెస్ మహిళల విభాగంలో కలెక్టరేట్–విన్నర్, అనంతపురం – రన్నర్,
చెస్ పురుషుల విభాగంలో ధర్మవరం – విన్నర్స్, కలెక్టరేట్–రన్నర్స్, షటిల్ బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో (45 ఏళ్లు పై బడి)–డబుల్స్‌లో జ్యోతి, ప్రతిమ–విన్నర్స్ , ప్రమీల, నిర్మల–రన్నర్స్ మహిళల విభాగం (45 ఏళ్ల లోపు), ప్రసన్నలక్ష్మీ, బాలమ్మ–విన్నర్స్, మాధవి, సురేఖ–రన్నర్స్, సింగల్స్ మహిళల విభాగంలో ప్రసన్న లక్ష్మీ– అనంతపురం–విన్నర్ , సురేఖ–ధర్మవరం–రన్నర్,
టెన్నికాయిట్ పురుషుల సింగల్స్ విభాగంలో సంజీవరెడ్డి–అనంతపురం , అక్రం–కలెక్టరేట్,
డబుల్స్ పురుషుల విభాగంలో కలెక్టరేట్–విన్నర్స్, అనంతపురం–రన్నర్స్ ,షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పురుషుల విభాగంలో కలెక్టరేట్–విన్నర్స్ , అనంతపురం–రన్నర్స్, సింగల్స్ పురుషుల విభాగంలో
కళ్యాణదుర్గం–విన్నర్స్, పెనుకొండ–రన్నర్స్, మహిళల విభాగం సింగల్స్‌లో ప్రసన్నలక్ష్మీ–కలెక్టరేట్,
సురేఖ–ధర్మవరం , షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో (45 ఏళ్లు పై బడి) కదిరి–విన్నర్స్,
కళ్యాణదుర్గం–రన్నర్స్, క్యారమ్స్ డబుల్స్ పురుషులు కలెక్టరేట్ (శ్రీధర్, గురుప్రసాద్)–విన్నర్స్, అనంతపురం(ప్రసాద్, పునీత్)–రన్నర్స్, సింగల్స్ పురుషుల విభాగంలో
గురుప్రసాద్–కలెక్టరేట్–విన్నర్ , ప్రసాద్–అనంతపురం–రన్నర్ , టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో రామకృష్ణారెడ్డి–కదిరి–విన్నర్స్,
షణ్ముఖ కుమార్ యాదవ్–ధర్మవరం–రన్నర్స్
కబడ్డీ పురుషుల విభాగంలో కలెక్టరేట్–విన్నర్స్,
కళ్యాణదుర్గం కీడ్రాకారులు రన్నర్స్‌గా నిలిచారు.