today last
-
నేటితో ప్రచారం సమాప్తం..
కరీంనగర్: జిల్లాలో మూడోవిడత నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సోమవారంతో ప్రచారం ముగియనుంది. ఎన్నికలకు ఇక రెండురోజులే మిగిలి ఉండడంతో పల్లెల్లో ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. జిల్లాలో మూడోవిడత ఐదు మండలాలు హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, సైదాపూర్, ఇల్లందకుంట మండలాలోŠల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల్లోని 109 సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 13 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 96 స్థానాలకు ఎన్నిక జరగనుంది. మొత్తంగా 404 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,024 వార్డుస్థానాలకు 227 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 797వార్డు స్థానాలకు 2,184 మంది బరిలో నిలిచారు. గ్రామాల్లో పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కులసంఘాలు, యువజన సంఘాలు, ఇతర కులాలను ఇలా ప్రతి ఒక్కరిని కలుస్తూ ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. బతుకుదెరువు కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు సహా ఉద్యోగ, ఉపాధి, చదువురీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని రప్పించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టారు. చాలాగ్రామాల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీతోపాటు మద్యం ఏరులై పారిస్తున్నారు. పెద్ద పంచాయతీలు మొదలు చిన్న గ్రామాలు సైతం ఇప్పటికే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.లక్షలు దాటినట్లు సమాచారం. గ్రామాల్లో పెద్ద కుటుంబాలు మొదలు, కాలనీలు, యువజన సంఘాలు, కులసంఘాలు, వార్డుల వారీగా ప్రచారం చేస్తూ వారి ఓట్లను రాబట్టేందుకు ఎంతకైనా సిద్ధమంటూ హామీలిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే తమస్థాయికి తగినట్లు పదిరోజుల నుంచి మద్యాన్ని కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు. కావాల్సిన మద్యాన్ని ముందే కొనుగోలు చేసి తమకు నమ్మకమైన వారి ఇళ్లల్లో ఉంచినట్లు తెలుస్తోంది. మేజర్ గ్రామపంచాయతీల్లో అదీ.. జనరల్ అయిన గ్రామపంచాయతీల్లో నగదు ప్రభావం విపరీతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమకు కేటాయించిన గుర్తుల నమూనాలతో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో కొందరు అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తుల బొమ్మలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న పెద్ద కుటుంబాలకు వెండి నాణాలు బహూకరిస్తున్నట్లు సమాచారం. 5 నుంచి 10ఓట్లు ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేస్తూ అభ్యర్థులు వారికి నజరానాలు ముట్టజెప్పుతున్నారు. ఇక వార్డు సభ్యులుగా పోటీచేస్తున్న వారు సైతం వెనుకాడకుండా తమకు కేటాయించిన గుర్తులను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రిజర్వ్ గ్రామపంచాయతీల్లో ఉపసర్పంచ్ పదవులకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో గ్రామాల్లో పెద్ద పెద్ద వ్యక్తులు సైతం వార్డు మెంబర్లుగా పోటీ చేస్తూ విచ్చలవిడిగా మద్యం, నగదు ఖర్చు చేస్తున్నారు. మూడవ విడత పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యుల ప్రచార హోరుతో పల్లెల్లో పంచాయతీ రాజకీయం వేడెక్కింది. నిబంధనలు కీలకం.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా అంతా సహకరించాలి. ప్రచారంలో అభ్యర్థులు సంబంధిత అధికారుల ద్వారా ముందస్తు లిఖితపూర్వక అనుమతులు లేకుండా, ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయాన్ని మించి ఊరేగింపులు తీయొద్దు. ప్రచారంలో లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదు. ప్రభుత్వ, ప్రై వేట్ స్థలాల్లో ఎన్నికల ప్రచార పోస్టర్లు అంటించొద్దు. గోడలపై ప్రచార రాతలతో ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. ఇలా చేస్తే 1997 చట్టం ప్రకారం మూడు నెలల కారగార శిక్ష.. లేదా రూ.1000 జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంటి యజమానుల అనుమతి తీసుకుని ప్రచారానికి వినియోగించుకోవచ్చు. రాతపూర్వకమైన అనుమతులు తీసుకుని ఆ పత్రాన్ని ఎన్నికల అధికారులకు పంపాలి. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైౖ వేట్ స్థలంలో సమావేశాన్ని నిర్వహించుకోవాలనుకున్నా.. కచ్చితంగా అనుమతి ఉండాల్సిందే. దేవాలయాలు, మసీదులు, చర్చిలు లేదా ప్రార్థన మందిరాలకు సంబంధించిన స్థలాల్లో ప్రచారం చేయడానికి అనుమతి ఉండదు. సభలు, సమావేశాలు నిర్వహించొద్దు. జాతి, మతం, కులం, ప్రాంతం ప్రాతిపదికన ఓటు వేయాలని కోరొద్దు. వ్యక్తిగత ఆరోపణలు చేయరాదు. అభ్యర్థుల నివాసాల వద్ద ప్రత్యర్థి పార్టీల వారు పో టాపోటీ కార్యకలాపాలు నిర్వహించొద్దు. ఎన్నికల ఊరేగింపుల నిర్వహణకు అనుమతి ఉండాలి. ఒక అభ్యర్థి ఊరేగింపు చేస్తున్నప్పుడు పోటీగా మరో ప్రదర్శన తీయరాదు. అనుమతులు పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్‌షోల వద్ద లౌడ్ స్పీకర్లు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే ఉపయోగించుకోవాలి. -
నేటితో ముగియనున్న ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్
ఎస్కేయూ : ఏపీ ఐసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగియనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం , ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 850 మంది హాజరయ్యారు. గత నాలుగు రోజులు కంటే శుక్రవారం అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారని ఎస్కేయూ హెల్ప్‌లైన్ సెంటర్ క్యాంప్ ఆఫీసర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. -
నేటితో ముగియనున్న తొలివిడత కౌన్సెలింగ్
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలు, పీజీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ - 2017 తొలి దఫా కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగియనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. జులై 6వ తేదీలోపు ఆన్లైన్ విధానం ద్వారా సీట్లు కేటాయిస్తామన్నారు. -
హోరాహోరీగా రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు రెండోరోజు హోరాహోరీగా సాగాయి. శనివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో కబడ్డీ, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, షటిల్, టెన్నికాయిట్ పోటీలను నిర్వహించారు. అన్ని విభాగాల్లోనూ కలెక్టరేట్ క్రీడాకారులు సత్తాను చాటారు. విజేతలుగా నిలిచారు. పురుషులతో సమానంగా క్రీడాకారిణులు కూడా సత్తాచాటారు. నేడు ముగియనున్న పోటీలు రెవెన్యూ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఆదివారం స్థానిక కృష్ణ కళా మందిరంలో జరగనున్నాయి. ముగింపు కార్యక్రమంలో క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరగనున్న రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ పోటీల్లో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పాల్గొననున్నారు. క్రికెట్ ఫైనల్ పోటీల్లో అనంతపురం రెవెన్యూ డివిజన్, కలెక్టరేట్ జట్లు తలపడనున్నాయి. రెండోరోజు విజేతలు వీరే క్యారమ్స్ డబుల్స్ విభాగంలో నిర్మల, ప్రమీల–విన్నర్స్ జ్యోతి, బాలమ్మ–రన్నర్స్ క్యారమ్స్ సింగల్స్ విభాగంలో నిర్మల–విన్నర్, సుజాత–రన్నర్ , చెస్ మహిళల విభాగంలో కలెక్టరేట్–విన్నర్, అనంతపురం – రన్నర్, చెస్ పురుషుల విభాగంలో ధర్మవరం – విన్నర్స్, కలెక్టరేట్–రన్నర్స్, షటిల్ బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో (45 ఏళ్లు పై బడి)–డబుల్స్‌లో జ్యోతి, ప్రతిమ–విన్నర్స్ , ప్రమీల, నిర్మల–రన్నర్స్ మహిళల విభాగం (45 ఏళ్ల లోపు), ప్రసన్నలక్ష్మీ, బాలమ్మ–విన్నర్స్, మాధవి, సురేఖ–రన్నర్స్, సింగల్స్ మహిళల విభాగంలో ప్రసన్న లక్ష్మీ– అనంతపురం–విన్నర్ , సురేఖ–ధర్మవరం–రన్నర్, టెన్నికాయిట్ పురుషుల సింగల్స్ విభాగంలో సంజీవరెడ్డి–అనంతపురం , అక్రం–కలెక్టరేట్, డబుల్స్ పురుషుల విభాగంలో కలెక్టరేట్–విన్నర్స్, అనంతపురం–రన్నర్స్ ,షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పురుషుల విభాగంలో కలెక్టరేట్–విన్నర్స్ , అనంతపురం–రన్నర్స్, సింగల్స్ పురుషుల విభాగంలో కళ్యాణదుర్గం–విన్నర్స్, పెనుకొండ–రన్నర్స్, మహిళల విభాగం సింగల్స్‌లో ప్రసన్నలక్ష్మీ–కలెక్టరేట్, సురేఖ–ధర్మవరం , షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో (45 ఏళ్లు పై బడి) కదిరి–విన్నర్స్, కళ్యాణదుర్గం–రన్నర్స్, క్యారమ్స్ డబుల్స్ పురుషులు కలెక్టరేట్ (శ్రీధర్, గురుప్రసాద్)–విన్నర్స్, అనంతపురం(ప్రసాద్, పునీత్)–రన్నర్స్, సింగల్స్ పురుషుల విభాగంలో గురుప్రసాద్–కలెక్టరేట్–విన్నర్ , ప్రసాద్–అనంతపురం–రన్నర్ , టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో రామకృష్ణారెడ్డి–కదిరి–విన్నర్స్, షణ్ముఖ కుమార్ యాదవ్–ధర్మవరం–రన్నర్స్ కబడ్డీ పురుషుల విభాగంలో కలెక్టరేట్–విన్నర్స్, కళ్యాణదుర్గం కీడ్రాకారులు రన్నర్స్‌గా నిలిచారు. -
నవ్య స్ఫూర్తి
నేటితో ముగియనున్న పుస్తక సంబరాలు అనంతపురం కల్చరల్ : బాల సాహిత్యం.. వ్యక్తిత్వ వికాసం.. ఆధ్యాత్మికం..సినీ, క్రీడా ఇలా అన్ని రకాల సాహితీ విందునందించిన నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ఆదివారంతో ముగియనున్నాయి. రాష్ట్ర సాంస్కతిక శాఖ, ఎన్టీఆర్ బుక్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల ఒకటి నుంచి అనంతపురంలో సాగిన. పుస్తక ప్రదర్శనతో జిల్లా వాసులకు ప్రఖ్యాతి చెందిన రచయితలు, రాజకీయ విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పేరు గాంచిన పబ్లిషింగ్ అధినేతలతో దగ్గరగా పరిచయం ఏర్పడింది. వివిధ పుస్తకాల ఆవిష్కరణల ద్వారా అనంత కరువు, సీమ కడగండ్లపై సాగిన రచనలలోని గొప్పతనాన్ని తెలుసుకునే వీలును కూడా బుక్ ఫెస్టివల్ కల్పించింది. యువతకు స్ఫూర్తి రగిలించే క్విజ్లు, సెమినార్లు, వ్యాసరచనలు, వక్తత్వం, చిత్రలేఖనం, స్పెల్‌బీ, పాటల, పద్యపఠన పోటీలు ఎన్నో జరిగాయి. ప్రాచీన కళల ప్రదర్శనకు పెద్ద పీట వేశారు. గడువు ఇక ఒక్కరోజే ఉంటుందని నగరవాసులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు అంటున్నారు. పుస్తక ప్రదర్శనను వినియోగించుకోండి వివిధ ప్రదేశాలలో రాష్ట్రస్థాయి పుస్తక సంబరాలు నిర్వహించాలన్న రాష్ట్ర సాంస్కతిక శాఖ ఆలోచన మేరకు తొలిసారి అనంతలో జరగడం ఆనందంగా ఉంది. నవ్యాంధ్ర, తెలంగాణాల రాష్ట్రాల నుండి వివిధ పుస్తక ప్రచురణ సంస్థలు తరలి వచ్చాయంటే నిజంగా వారిని అభినందించాలి. అందరి అభిరుచికి తగ్గట్టు పుస్తకాలను జిల్లా వాసుల ముగింట చేర్చాము. మిగిలిన ఒక రోజు గడువును కూడా సాహితీ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలన్నదే మా విన్నపం. – అనంత్, పుస్తక ప్రదర్శన సమన్వయకర్త