
హైదరాబాద్ నగర శివారులో దారుణం
నగర శివార్లలోని హయత్‌నగర్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది.
- తొమ్మిదో తరగతి విద్యార్థిపై యువకుల అత్యాచారయత్నం
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్‌నగర్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాలికను బలవంతంగా తమ కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.
బాధితురాలి అరుపులు కేకలతో అప్రమత్తమైన స్థానికులు రమేశ్, శ్రీకాంత్ అనే యువకులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. బాలికను చెరవిడించారు. మంగళవారం సాయంత్రం జరిగిన అబ్దుల్లాపూర్‌మెట్ మండటం మజీద్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.