
సాక్షి, పెద్దఅంబర్‌పేట: అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్‌గా కె.వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన విజయారెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జిగా కొనసాగారు. పూర్తిస్థాయి తహసీల్దార్‌గా ప్రభుత్వం వెంకట్‌రెడ్డిని నియమించింది. హయత్‌నగర్‌లో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ నుంచి వెంకట్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌కు వెళ్లి తహసీల్దార్ కార్యాలయం నిర్వహణకు మరో భవనాన్ని చూశారు. బీసీ కాలనీలో గల కమ్యూనిటీ భవనాన్ని పరిశీలించారు.