ఒకేచోట 67 బోరు బావులు
హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్‌లో రెవిన్యూ అధికారులు హడావుడి చేశారు. ఒకే ప్రాంతంలో పదుల సంఖ్యలో బావులను గుర్తించారు. దీంతో వాటిని పూడ్చివేసే చర్యలకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్‌లో ఒకే చోట పెద్ద సంఖ్యలో బోరు బావులు ఉన్నట్లు సాక్షిలో కథనం ప్రసారం కావడంతో అప్రమత్తమైన అధికారులు అక్కడికి వెళ్లి మొత్తం 67 బోరు బావులు గుర్తించారు. దీంతో వాటిని తీయించిన వారిని గట్టిగా మందిలిస్తూ వాటిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. బోరు వేసి వదిలేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఎమ్మార్వో విజయ చెప్పారు.