హైదరాబాద్: వేగంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాపడ్డారు. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
దీంతో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. ఇది గుర్తించిన స్థానికులు గంట పాటు శ్రమించి వారిని బయటకు తీశారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి... కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.