సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, రెండు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ.19.28 లక్షల అనధికారిక నగదును స్వాదీనం చేసుకుంది. వరుసగా రెండో రోజు గురువారం కూడా ఏసీబీ అధికారులు ఆయా కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు అక్రమాలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను గుర్తించారు. నగదుపై అధికారులు ఇచ్చిన వివరణను విశ్లేషించాక సబ్ రిజిస్ట్రార్లు, ఇతరులపై పీసీ చట్టం కింద క్రిమినల్ కేసుల నమోదుతో పాటు, తహసీల్దార్లపై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.
జప్తు చేసిన నగదు
♦ గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి రూ.1.04 లక్షలు
♦ జలుమూరు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ అధికారి నుంచి రూ.27,500.
♦ బద్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.2.70 లక్షలు, డాక్యుమెంట్ రైటర్ నుంచి రూ.2.10 లక్షలు
♦ అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ప్రైవేట్ డ్రైవర్ ఎస్‌కే ఇస్మాయిల్ డాక్యుమెంట్ రైటర్ల నుంచి వసూలు చేసిన రూ.2 లక్షలకు పైగా నగదు
♦కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.41 వేలు, డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.94 వేలు జప్తు వన్నం సతీశ్ అనే డాక్యుమెంట్ రైటర్ ఆరు నెలల్లో సబ్ రిజిస్ట్రార్‌కు రూ.94 వేలు, సబ్ రిజిస్ట్రార్ అటెండర్‌కు రూ.1.20 లక్షలు ఫోన్ పే ద్వారా పంపినట్టు గుర్తించారు.
♦ తిరుపతి రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ వద్ద రూ.90 వేలు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల వద్ద రూ.56 వేలు, జూనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9 వేలు
♦ నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.30 వేలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.20 వేలు, సీనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9,500, ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.6 వేలు.
♦ జగదాంబ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం( విశాఖపట్నం)లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ ప్రైవేటు ఉద్యోగి మూడు విడతల్లో ఓ సబ్ రిజిస్ట్రార్‌కు రూ.90 వేలు పంపినట్టు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.39 వేలు స్వాధీనం చేసుకున్నారు.
♦ తుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.20 వేలు, లెక్కల్లోకి రాని మరో రూ.20 వేలు.
తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.19.28 లక్షలు జప్తు
Published Fri, Apr 28 2023 4:16 AM | Last Updated on Fri, Apr 28 2023 9:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment