Sub-Registrar Offices
-
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోటెత్తిన జనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వస్తే అన్నిటితోపాటు ఆస్తుల విలువలూ పెరగడం తథ్యం. ఇప్పుడూ అదే పరిస్థితి. జనవరి ఒకటో తేదీ నుంచి భూములు, నిర్మాణాల విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అదీ సాదాసీదాగా కాదు.. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు తలకుమించిన భారంగా మారనున్నాయి. ప్రస్తుతం రూ.2 లక్షలు కట్టాల్సిన రిజిస్ట్రేషన్ల ఛార్జీలు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెరగనున్నాయి. అన్ని రకాల ఆస్తుల విలువల్లో భారీగా పెరుగుదల ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ ఛార్జీల భారం నుంచి తప్పించుకునేందుకు స్థిరాస్తులు కొనే వారు ఈ నెలాఖరులోపే రిజి్రస్టేషన్లు పూర్తి చేసుకునేందుకు హడావుడి పడుతున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. రెండు రోజులుగా కార్యాలయాల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా రోజుకు 80 వరకు రిజి్రస్టేషన్లు జరుగుతాయి. గురువారం ఒక్క రోజే 220 రిజి్రస్టేషన్లు జరిగాయి. శుక్రవారమూ 250 వరకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
గ్రామాల్లో మొదలైన ఆస్తుల రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ప్రభుత్వం మరో భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు అనుకూలంగా పరిపాలనను మండలం నుంచి గ్రామ స్థాయికి తీసుకువచ్చిన ప్రభుత్వం.. దాన్ని మరింత మెరుగుపరిచేలా రిజిస్ట్రేషన్ల సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. భూముల రీసర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. తమ గ్రామాల్లోని సచివాలయాలకు వెళితే అక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే అన్ని సేవలు పొందవచ్చు. సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశల్లోనూ పూర్తయి అక్కడ డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రారంభించాలని గతంలోనే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందుకోసం మొదట ప్రయోగాత్మకంగా రీసర్వే పూర్తి చేసిన 51 గ్రామ సచివాలయాలను గత సంవత్సరం జనవరిలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించి అక్కడి పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. ఆ తర్వాత 2022 నవంబర్‌లో 1,949 సచివాలయాలు, ఈ నెల 23న మరో 195 సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించింది. వీటిలో రీసర్వే పూర్తయిన 2 వేల గ్రామాలను 1,535 గ్రామ సచివాలయాలుగా మ్యాపింగ్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎం దిశా నిర్దేశం.. ఊపందుకున్న రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తి స్థాయిలో మొదలు కావాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఈ నెలాఖరు నాటికి ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. దీంతో ఈ 15 రోజుల్లోనే దాదాపు అన్ని సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు ఊపందుకున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే సర్టిఫైడ్ కాపీ, ఈసీ సర్టిఫికెట్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీ సహా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ను మొదలుపెట్టారు. ఇప్పటివరకు 4,300కిపైగా రిజిస్ట్రేషన్లను సచివాలయాల్లో చేశారు. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.7.67 కోట్ల ఆదాయం లభించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోని 44 గ్రామ సచివాలయాల్లో 766 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ 2 వేల గ్రామాలకు సంబంధించి సచివాలయాల ద్వారా 16 లక్షల ఈసీలు, 62 లక్షల సర్టిఫైడ్ కాపీలు జారీ చేశారు. ఈ సేవల్ని మరింత విస్తృతంగా సచివాలయాల నుంచి అందించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సేవల గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రజల ముంగిటకే రిజిస్ట్రేషన్ సేవలు ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకువెళ్లే విధానాన్ని రిజిస్ట్రేషన్ల శాఖలోనూ ప్రవేశపెట్టాం. రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ప్రజలు ఈ సర్వీసుల్ని వినియోగించుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఎవరి గ్రామాల్లో వారు ఈ సేవలను పొందవచ్చు. రిజిస్ట్రేషన్లు చేయడం కోసం ఆయా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. – వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. -
తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.19.28 లక్షలు జప్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, రెండు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ.19.28 లక్షల అనధికారిక నగదును స్వాదీనం చేసుకుంది. వరుసగా రెండో రోజు గురువారం కూడా ఏసీబీ అధికారులు ఆయా కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు అక్రమాలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను గుర్తించారు. నగదుపై అధికారులు ఇచ్చిన వివరణను విశ్లేషించాక సబ్ రిజిస్ట్రార్లు, ఇతరులపై పీసీ చట్టం కింద క్రిమినల్ కేసుల నమోదుతో పాటు, తహసీల్దార్లపై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. జప్తు చేసిన నగదు ♦ గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి రూ.1.04 లక్షలు ♦ జలుమూరు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ అధికారి నుంచి రూ.27,500. ♦ బద్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.2.70 లక్షలు, డాక్యుమెంట్ రైటర్ నుంచి రూ.2.10 లక్షలు ♦ అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ప్రైవేట్ డ్రైవర్ ఎస్కే ఇస్మాయిల్ డాక్యుమెంట్ రైటర్ల నుంచి వసూలు చేసిన రూ.2 లక్షలకు పైగా నగదు ♦కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.41 వేలు, డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.94 వేలు జప్తు వన్నం సతీశ్ అనే డాక్యుమెంట్ రైటర్ ఆరు నెలల్లో సబ్ రిజిస్ట్రార్‌కు రూ.94 వేలు, సబ్ రిజిస్ట్రార్ అటెండర్‌కు రూ.1.20 లక్షలు ఫోన్ పే ద్వారా పంపినట్టు గుర్తించారు. ♦ తిరుపతి రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ వద్ద రూ.90 వేలు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల వద్ద రూ.56 వేలు, జూనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9 వేలు ♦ నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.30 వేలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.20 వేలు, సీనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9,500, ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.6 వేలు. ♦ జగదాంబ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం( విశాఖపట్నం)లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ ప్రైవేటు ఉద్యోగి మూడు విడతల్లో ఓ సబ్ రిజిస్ట్రార్‌కు రూ.90 వేలు పంపినట్టు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.39 వేలు స్వాధీనం చేసుకున్నారు. ♦ తుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.20 వేలు, లెక్కల్లోకి రాని మరో రూ.20 వేలు. -
YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం
సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత మూడేళ్లుగా అవినీతి రహిత పాలన చేస్తున్నారు. నాడు ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు నవరత్నాల పథకాల్లో భాగంగా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అవినీతికి అడ్డాగా ఉన్న శాఖల్లో ఒకటైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో భూములు, స్థలాల క్రయ విక్రయదారుల నుంచి అధికారులతోపాటు దస్తావేజు లేఖర్లు వేలల్లో లంచాలు వసూలు చేసి వారి జేబులను ఖాళీ చేసేవారు. దీంతో ఆ శాఖలో అవినీతికి చెక్ పెట్టేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో కెమెరాల ఏర్పాటు వైఎస్సార్ జిల్లాలో కడప అర్బన్, కడప రూరల్, కడప చిట్స్, సిద్దవటం, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, వేంపల్లె, కమలాపురం, దువ్వూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలి, పుల్లంపేట, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె, మదనపల్లె, పీలేరు, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు, తంబళ్లపల్లెలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో కార్యాలయాలకు ప్రతిరోజు వచ్చి వెళ్లే వారిని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అవినీతికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. చదవండి: (ఆర్ఎంపీల చేతిలో అస్త్రాలివే.. ఇష్టమొచ్చినట్లు వాడితే అంతే సంగతులు) వెబ్సైట్లో దస్తావేజు నమూనా స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారంలో క్రయ విక్రయదారులు ఎక్కువగా దస్తావేజుల లేఖర్లను ఆశ్రయించడంతో పదుల సంఖ్యలో దస్తావేజు లేఖర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. వారితోపాటు కొంతమంది రిజిస్ట్రేషన్ సిబ్బంది కాకుండా బినామీలు కార్యాలయాలు తెరిచి తమ వారితో నిర్వహిస్తున్నారు. దీంతో దస్తావేజుల తయారీ సమయంలో లేఖర్లు చెప్పిందే వేదంగా అక్కడి వ్యవహారాలు నడిచేవి. క్రయ విక్రయదారులను లేఖర్ల బాధ నుంచి తప్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నమూనా దస్తావేజులను ఆ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు స్థిరాస్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో ప్రజలు లంచాల బారిన పడకుండా వారి సొంత గ్రామాల్లో వార్డుల పరి«ధిలోనే స్థిరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి సచివాలయ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. అవినీతిపై ఫిర్యాదు చేయవచ్చు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు, సిబ్బంది తీరుపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. లంచాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 14400 నంబరుకుగానీ, జిల్లా రిజిస్ట్రార్‌కుగానీ నేరుగా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – బి.శివరాం, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, కడప 14400 నంబరుతో ఫ్లెక్సీల ఏర్పాటు అవినీతికి అడ్డుకట్ట వేసేలా, అలాగే లంచగొండితనంపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన టోల్ ఫ్రీ నంబరు 14400పై ప్రజ లకు అవగాహన కలిగేలా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. -
సబ్ రిజిస్రార్ కార్యాలయాల్లో తనిఖీలు
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్/జమ్మలమడుగు రూరల్: నకిలీ చలానాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తీసిన చలానాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల గుట్టు బయటపడింది. అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో ఈ కుంభకోణం జరిగినట్టు తేలింది. ఎక్కువగా పశ్చిమ గోదావరిలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాలు బయటపడగా రూ.28.58 లక్షలు పక్కదారి పట్టాయి. విజయనగరం జిల్లాలోని 6 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.36.14 లక్షలు తేడా వచ్చింది. కృష్ణా జిల్లాలోని 6 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.4.20 కోట్లు, గుంటూరు జిల్లాలో 5 కార్యాలయాల్లో రూ.9.25 లక్షలు దారి మళ్లాయి. వైఎస్సార్ జిల్లాలో రెండు ఆఫీసుల్లోనే నకిలీ చలానాలు గుర్తించినా రూ.1.29 కోట్ల మొత్తం తేడా వచ్చింది. విశాఖ జిల్లాలోని రెండు కార్యాలయాల్లో రూ.1.39 కోట్లు దారి మళ్లాయి. మొత్తంగా ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సిన రూ.8.13 కోట్లు పక్కదారి పట్టినట్టు గుర్తించారు. ఇందులో రూ.4.62 కోట్లను ఇప్పటికే రికవరీ చేశారు. వైఎస్సార్, విశాఖ, విజయవాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో మొత్తం సొమ్మును రికవరీ చేయగా.. మిగిలిన జిల్లాల్లో రికవరీ జరగాల్సి ఉంది. 38 కార్యాలయాల్లో ఇప్పటివరకు 14 మందిని విధుల నుంచి తప్పించారు. అందులో 9మంది సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, ఇతరులపై 33 కేసులు నమోదు చేశారు. రెండేళ్లుగా రిజిస్ట్రేషన్ అయిన 60 లక్షలకుపైగా డాక్యుమెంట్లను తనిఖీ చేసేందుకు ప్రణాళిక రూపొందించిన అధికారులు ఇప్పటికే చాలావరకు తనిఖీలు పూర్తి చేశారు. ఒంగోలులోనూ నకిలీ చలానాల కలకలం ప్రకాశం జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వారం రోజులుగా విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ పి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో 18 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ జాయింట్–1, జాయింట్–2 పరిధిలో నకిలీ చలానాల ద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తేల్చారు. మొత్తం 71 రిజిస్ట్రేషన్ల ద్వారా 77 ఈ–చలానాలను సృష్టించారు. వీటిద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.26,74,850 మొత్తాన్ని చెల్లించకుండానే నకిలీ చలానాల ద్వారా మోసం చేసినట్టు తేలింది. ఇప్పటివరకు బయటపడిన నకిలీ చలానాలన్నీ ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉండే డాక్యుమెంట్ రైటర్ కాజా పవన్‌కుమార్ ఒక్కడే చేసినట్టు నిర్ధారణ అయింది. రూ.26,74,850 మొత్తం రాబట్టామని ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ జాయింట్–2 షేక్ జాఫర్ తెలిపారు. పవన్‌కుమార్ పరారీలో ఉన్నాడని, అతనిపై పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశామని చెప్పారు. జమ్మలమడుగులో ఏసీబీ సోదాలు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. కడప ఏసీబీ డీఎస్పీ పి.కంజాక్షన్ ఆధర్వంలో సీఐలు టి.రెడ్డెప్ప, ఎస్.రామాంజనేయులు, కృష్ణమోహన్ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ కంజాక్షన్ మాట్లాడూతూ ముందస్తు సమాచారం మేరకు సోదాలు నిర్వహించామని చెప్పారు. కార్యాలయ ఆవరణలో అనధికారికంగా ఉన్న ఐదుగురు దస్తావేజు లేఖరుల నుంచి రూ.84,040 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యాలయంలో అవకతకలు జరిగాయా అనే కోణంలో కక్షిదారులను విచారించారు. -
ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ
సాక్షి, విజయవాడ: నకిలీ చలానాల కేసులో 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు రూ.4.11 కోట్లు రివకరీ చేసినట్లు రిజిస్ట్రేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 26 మంది రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 12 మంది సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఫేక్ చలనాలు సృష్టించకుండా కొత్త సాఫ్ట్వేర్ తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ చేస్తామని తెలిపారు. క్యాష్ లెస్ వ్యవహారాల ద్వారా నకిలీలకు చెక్ పెడతామని రజత్ భార్గవ తెలిపారు. ఇవీ చదవండి: ‘ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరు’ రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ -
ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండరాదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని సూచించారు. సమగ్ర భూసర్వేకి సంబంధించి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ పథకంపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏం చెప్పారంటే.. ఎలాంటి రుసుము వసూలు చేయవద్దు.. సర్వే వేగంగా చేపట్టినందున రాళ్ల సరఫరా కూడా అంతే ముఖ్యం. రాళ్ల సరఫరా ఆలస్యం కాకుండా చూడాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు. ప్రతి గ్రామ సచివాలయంతో పాటు వార్డులలో ఒక హోర్డింగ్ పెట్టాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వివరాలు ఉండాలి. ముఖ్య కూడళ్లలో శాశ్వత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. సర్వే ముగిసిన గ్రామాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సమగ్ర సర్వే పూర్తయిన 51 గ్రామాల్లో రికార్డుల ప్యూరిఫికేషన్, రికార్డుల అప్డేషన్, సర్వే రాళ్లు పాతడం లాంటివి ముగిసే నాటికి? ఆయా గ్రామాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా ఏర్పాటు కావాలి. ఈ ఏడాది జూలై నాటికి ఆ 51 గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రారంభం కావాలి. అప్పుడే సమగ్ర భూసర్వే పూర్తైనట్లుగా భావించాలి. ఆ మేరకు సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం తగిన ఏర్పాట్లు చేయాలి. సీసీఎల్ఏ కీలకపాత్ర.. సమగ్ర భూ సర్వే సజావుగా జరిగేలా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలి. ఈ ప్రక్రియ మొత్తంలో భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌ది కీలకపాత్ర. వచ్చే జనవరికి తొలిదశ పూర్తి సమగ్ర భూ సర్వే వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత మూడు నెలలుగా వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటం, యంత్రాంగం అంతా ఆ ప్రక్రియలో నిమగ్నం కావడం, దీర్ఘకాలం పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం తదితర కారణాల వల్ల సమగ్ర భూ సర్వేలో కొంత జాప్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.26 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో 17,460 గ్రామాలు, 47,861 ఆవాసాల (హ్యాబిటేషన్స్)కు సంబంధించి సమగ్ర సర్వేకు పక్కాగా ఎస్వోపీ (ప్రామాణిక యాజమాన్య విధానం) రూపొందించినట్లు తెలిపారు. తొలిదశలో జిల్లాకు ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ఆ తర్వాత ప్రతి డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాలు, ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 51 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణ పూర్తి అయిందని, వచ్చే నెల నుంచి గ్రామ స్థాయిలో సర్వే మొదలు పెట్టి జూలై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే 545 గ్రామాల్లో డ్రోన్లతో సర్వే పూర్తి చేసి ఛాయాచిత్రాలు సేకరించామని, వ్యవసాయ భూములు, హ్యాబిటేషన్ల (నివాస ప్రాంతాలు)కు సంబంధించి 2,693 ఛాయాచిత్రాలు తీశామని వివరించారు. మండలానికి ఒకటి చొప్పున 650 గ్రామాలలో సర్వే మొదలుపెట్టి వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఫిబ్రవరిలో రెండో దశ సర్వే.. సమగ్ర భూ సర్వే రెండో దశ సర్వేను 2022 ఫిబ్రవరిలో ప్రారంభించి వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 2022 నవంబరులో మూడో దశ.. మూడో దశను వచ్చే ఏడాది నవంబరులో మొదలు పెట్టి 2023 ఏప్రిల్ నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సర్వే సిబ్బందికి సంప్రదాయ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, మైన్స్ డీఎంజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు. ఎక్కడ, ఎవరు ఏ చిన్న అవినీతికి పాల్పడినా మొత్తం కార్యక్రమానికి చెడ్డపేరు వస్తుంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ప్రతిచోటా తనిఖీ పక్కాగా ఉండాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – సీఎం వైఎస్ జగన్ రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు... మొత్తం భూ రికార్డులు, డేటాను అప్డేట్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం నుంచి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం లభించేలా చూడాలి. ఆ విధంగా ఒక సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. సర్వే ప్రక్రియకు నిధుల కొరత రాకూడదు. సర్వే తర్వాత పక్కాగా సరిహద్దులు చూపాలి. మొత్తం సర్వే పూర్తయిన తర్వాత చెత్తా చెదారం తొలగించి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే జంగిల్ క్లియరెన్స్ కింద వాటన్నింటినీ తొలగించి చివరగా రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు పాతాలి. ఆ విధంగా ఈ ప్రక్రియలో రైతుల ప్రమేయం కూడా ఉండాలి. -
ఇక రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్ స్లాట్!
సాక్షి, హైదరాబాద్: ఇకపై స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్లాట్ (పలానా రోజు,సమయం)ను బుక్ చేసుకునే సదుపాయం అందుబా టులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి ఆన్లైన్ స్లాట్ విధానం అమలుకు స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధమైంది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో స్లాట్ విధానానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాతే స్లాట్ బుక్ చేసుకోని వారి దస్తావేజులను పరిశీలించి నమోదు చేయనున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారి దస్తావేజుల నమోదు రోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పూర్తిచేస్తారు. రిజిస్ట్రేషన్ తర్వాత స్కాన్ అయిన డాక్యుమెంట్లను ఆ రోజే సంబంధిత దస్తావేజుదారుకు అందజేస్తారు. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజు 18 మందికి మాత్రమే స్లాట్ బుక్ చేసుకొని స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్లాట్ బుకింగ్ ఇలా..:స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో లాగిన్ కావాలి. ఆన్లైన్ ప్రీ–రిజి స్ట్రేషన్ డాటా ఎంట్రీకి అవకాశం ఇవ్వడంతో దస్తావేజుదారులు ఇంటి వద్దే ఆన్లైన్లో డాక్యుమెంట్‌ను తయారుచేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ చలానా నమూనాలతో పాటు ఫీజు రుసుం వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఉంటాయి. పబ్లిక్ డాటా ఎంట్రీ పూర్తిచేసి ఎలక్ట్రానిక్ చలానా జత పర్చాల్సి ఉంటుంది. ఆన్లైన్లో డాక్యుమెంట్ ఎంట్రీ పూర్తి కాగానే పది అంకెల నంబర్ వస్తుంది. స్లాట్ సమయానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి ఈ పది అంకెల నంబర్‌ను సబ్ రిజిస్ట్రార్‌కు ఇస్తే వెంటనే దానిని ఆన్లైన్లో పరిశీలించి తప్పులుంటే సరిచేస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియను పూర్తి చేసి సాయంత్రంలోగా స్కాన్ చేసిన దస్తావేజులను ఇస్తారు. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డాటా ఎంట్రీకి స్వస్తి... స్లాట్ బుకింగ్ ఆన్లైన్ విధానం వల్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో డాటా ఎంట్రీకు స్వస్తి పలకనున్నారు. ఆన్లైన్లోనే పూర్తి ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటివరకు స్థిరాస్తి కొనుగోలుదారులు డాక్యుమెంట్ రైటర్ వద్ద దస్తావేజులు తయారు చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆఫ్‌లైన్‌లో సమర్పించేవారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు డాటా ఎంట్రీ చేసి రిజిస్ట్రేషన్ నమోదు పూర్తి చేసేవారు. ఇక మీదట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాటా ఎంట్రీ ఉండదు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
-
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
- నల్లగొండ మినహా రాష్ట్రవ్యాప్తంగా సోదాలు - పెండింగ్‌లో ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం - ప్రభుత్వం సమాచారమివ్వడంతో సర్దుకున్న సబ్ రిజిస్ట్రార్లు సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: మియాపూర్ భూకుంభకోణం నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)రంగంలోకి దిగింది. అనుమానిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది. పాత జిల్లాల ప్రకారంనల్లగొండ మినహా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్‌లో దాడులు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలి పారు. జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ తమ బృందాలు దాడులు చేశాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే, వీటిలో ప్రభుత్వ భూములకు సంబంధించిన పెండింగ్ రిజిస్ట్రేషన్లున్నాయా? లేవా అన్న అంశంపై నివేదిక రూపొందిస్తామని, అర్ధరాత్రి వరకు కూడా తమ బృందాలు దాడులు నిర్వహిస్తూనే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందస్తుగానే ఏసీబీ, స్పెషల్ స్క్వాడ్ల దాడుల సమాచారం ఇవ్వడంతో సబ్ రిజిస్ట్రార్లు అప్రమత్తమై పెండింగ్, ఆన్లైన్ పోర్టల్‌లో ఎంటర్చేయని డాక్యుమెంట్లను మాయం చేశారని ఏసీబీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు సబ్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల ఇళ్లు, బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు. రిజిస్ట్రేషన్ పూర్తయినా కార్యాలయంలోనే దస్త్రాలు... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయినా కార్యాలయంలోనే దస్త్రాలు ఉండడంపై సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. గత నాలుగేళ్ల ఇంటర్నల్ ఆడిట్ నివేదిక కనపడకపోవడంపై ప్రశ్నించగా సస్పెన్షన్‌కు గురైన సబ్ రిజిస్ట్రార్ పాపయ్య తీసుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని నాగోలు కో–ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో ఉన్న మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేశ్‌చంద్రారెడ్డి ఇంటి నుంచి కిలో బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, ఇతర విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్‌చంద్రారెడ్డి ఎల్బీ నగర్లో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసినప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారంటూ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ పద్మారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీ నగర్ పోలీసులు మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘రియల్’ ఢమాల్
పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం వెలవెలబోతున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు నల్లధనాన్ని మార్చుకునేందుకు తంటాలు బంధువులు, మిత్రులు, బినామీల ఖాతాల్లో జమ చేసేందుకు యత్నాలు నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యం క్రయవిక్రయాలు, దస్తావేజులు, రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడే సబ్ రిజిష్టార్ కార్యాలయాలు మూడు రోజులుగా వెలవెల బోతున్నారుు. రోజు పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయాల్లో ప్రస్తుతం నాలుగైదుకు మించి కూడా జరగడం లేదు. జిల్లాలో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగే నిజామాబాద్ రూరల్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు రోజులుగా ఐదారు రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. ఈ రెండు కార్యాలయాల్లో మామూలు రోజుల్లో సుమారు 40 నుంచి 50 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ.500, రూ.100 నోట్లు చెలామణి రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తెల్లవారి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. నల్లదనం ఎక్కువగా చెలామణి అయ్యే రంగాల్లో రియల్ ఎస్టేట్ ప్రధానమైనది. ఆయా స్థిరాస్తుల మార్కెట్ ధర కంటే రిజిస్ట్రేషన్ ధరను తక్కువగా పేర్కొంటూ స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరుగుతారుు. ఈ రెండు ధరల మధ్య తేడా మొత్తాన్ని బ్లాక్‌మనీ రూపంలో చేతులు మారుతారుు. పెద్ద నోట్ల రూపంలో ఈ లావాదేవీలు జరుగుతారుు. ఈ పెద్ద నోట్ల చెలామణి రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయంతో ఈ బ్లాక్ మనీతో కూడిన లావాదేవీలు పూర్తిగా పడిపోయారుు. అలాగే రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ముందుగా బ్యాంకుల్లో చలానాలు కట్టాలి. బ్యాంకుల శాఖలన్నీ పెద్ద నోట్ల మార్పిడి పనుల్లోనే నిమగ్నం కావడంతో ఈ చలానాలు తీసుకునే పరిస్థితి లేదు. దీంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయారుు. జిల్లాలో దాదాపు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ దస్తావేజుల రిజిస్ట్రేషన్లు పూర్తిగా పడిపోయారుు. ఈ పరిస్థితి ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని ఆ శాఖ వర్గాలు భావిస్తున్నారుు. ’రియల్’ డబ్బునేం చేద్దాం.. జిల్లాలో రియల్ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా భూముల ధరలు పెంచేశారు. నిజామాబాద్ నగర శివారుతోపాటు, బోధన్, ఆర్మూర్ వంటి పట్టణాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటీవల జిల్లాగా మారిన కామారెడ్డిలోనైతే రియల్ వ్యాపారులు భూములను అమాంతం పెంచేశారు. రిజిస్ట్రేషన్, మార్కెట్ ధరల మధ్య భారీ తేడాతో పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీని ఆర్జించారు. ఈ మొత్తాన్ని ఎలా చెలామణిలోకి తెచ్చుకునేందుకు ఇప్పుడు తంటాలు పడుతున్నారు. తమ బంధువులు, ఆప్తమిత్రుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామంటూ బతిమాలుకుంటున్నట్లు సమాచారం. ఉన్న ఫలంగా తమ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ అరుుతే ఆదాయపన్ను శాఖ నోటీసులు, వంటి తలనొప్పులు మాకెందుకంటూ చాలా మంది ఇందుకు నిరాకరిస్తున్నారు. పాత తేదీల్లో బంగారం కొనుగోళ్లు.. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. నల్లధనాన్ని బంగారం రూపంలో మార్చుకునేందుకు నల్లధనం ఉన్నవారు ప్రయత్నాల్లో ఉన్నారు. పెద్ద నోట్ల చెలామణి రద్దు చేస్తూ మంగళవారం ప్రకటన కంటే ముందు పాత తేదీల్లో బంగారాన్ని కోనుగోలు చేసే అవకాశాలుండటంతో సంబంధిత శాఖల నిఘా వర్గాలు ఈ లావాదేవీలపై దృష్టి సారించారు. పాత తేదీల్లో బంగారాన్ని విక్రరుుంచినట్లు బంగారం వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపకుండా సంబంధిత శాఖల అధికారులు ఈ లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం. -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు
-రూ.1.89కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని మరో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంతభవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రూ.1.89కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట్, నల్గొండ జిల్లాలోని భువన గిరి, యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం కోసం ఒక్కో భవనానికి రూ.63లక్షలు ప్రభుత్వ కేటాయించింది. నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్‌ను సర్కారు ఆదేశించింది. -
కార్యాలయాలు కిటకిట
రేపటి నుంచి విలువల పెంపు కక్షిదారుల ఉరుకులు పరుగులు హడావుడిగా రిజిస్ట్రేషన్లు విజయవాడ : జిల్లాలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం భూములు, స్థలాల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువలు పెంచనుంది. ఈ క్రమంలో విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 28 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత కొద్దిరోజులుగా రిజిస్ట్రేషన్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో విక్రయాలు జరుపుకొని అగ్రిమెంట్ల మీద ఉన్న ఆస్తులను హడావుడిగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మార్కెట్ విలువలు 20 నుంచి 30 శాతం పెరగనుండటంతో, స్టాంప్ డ్యూటీ భారం కొనుగోలుదారులపై పడుతుందని కక్షిదారులు పెండింగులో ఉన్న లావాదేవీలను అత్యవసరంగా పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత నెలకంటే జూలైలో అన్ని రిజిస్ట్రేషన్లు అధికంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జూన్‌లో 15 వేల 81 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా, జూలైలో 20 వేల 764 అంటే దాదాపు ఐదు వేల రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగాయి. జిల్లాలో మూడు డీఆర్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో గత రెండు మాసాలుగా లభించిన ఆదాయం వివరాలిలా ఉన్నాయి. జూన్‌లో విజయవాడ వెస్ట్ డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.25.44 కోట్లు లక్ష్యం కాగా, రూ.16.41 కోట్ల ఆదాయం లభించింది. విజయవాడ తూర్పు డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.22.48 కోట్లు లక్ష్యం నిర్ణయించగా, రూ.12.43 లక్షల ఆదాయం వచ్చింది. మచిలీపట్నం డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.11.52 లక్ష్యం కాగా, రూ.8.27 కోట్ల మేర ఆదాయం లభించింది. జూలైలో విజయవాడ వెస్ట్ డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.34.98 కోట్లు టార్గెట్ కాగా, రూ.23.81 కోట్ల మేరకు ఆదాయం లభించింది. విజయవాడ తూర్పు డీఆర్ పరిధిలో రూ.30.91 కోట్ల లక్ష్యం కాగా, రూ.19.73 కోట్ల ఆదాయం వచ్చింది. మచిలీపట్నం డీఆర్ కార్యాలయ పరిధిలో రూ.15.84 కోట్ల లక్ష్యంకాగా, రూ.12.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
తనిఖీలతో హడలెత్తించిన డిప్యూటీ సీఎం
కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన విధులకు ఆలస్యంగా హాజరవుతున్న ఉద్యోగులపై మండిపాటు దళారులను దూరంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు సాక్షి, కర్నూలు : రాష్ట్ర ఉప ముఖ్యంత్రి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు కేఈ కృష్ణమూర్తి చేపట్టిన ఆకస్మిక తనిఖీ ఆ శాఖ ఉద్యోగుల్లో దడ పుట్టించింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా తన సొంత శాఖకు చెందిన కార్యాలయాల్లో శుక్రవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్టి, సొంత శాఖ ప్రక్షాళనకు ఆయన నడుబింగించారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయానికి ఆయన ఉదయం 10.30 గంటలకే చేరుకుని ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తొలుత కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. సమయపాలన పాటించకుండా ఆలస్యంగా కార్యాలయాలకు వస్తున్న వారిపై మండిపడ్డారు. ఎవరెవరు రాలేదని ఆరా తీశారు. వారందరికీ హాజరు పట్టికలో గైర్హాజరు వేయించారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కారాదని వారిని తీవ్రంగా హెచ్చరించారు. అలాగే సెంట్రల్ సర్వర్ పనిచేస్తుందా లేదా అని అదే కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో ఎన్ని రిజిస్ట్రేషన్లు స్కానింగ్ చేశారనే వివరాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. 14వ తేదీ గురువారం ఒక్కరోజు 32 డాక్యుమెంట్లు, రూ 6.50 లక్షల ఆదాయం వచ్చిందని సబ్‌రిజిస్ట్రార్ వెంకటరమణారావు వివరించారు. అక్కడి నుంచి నేరుగా రికార్డు గదిలోకి వెళ్లి రికార్డులను పరిశీలించారు. అదే సమయంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరావు విధులకు హాజరుకావడంతో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ తనిఖీలు.. కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ డిప్యూటీ సీఎం తనీఖీ చేశారు. జూనియర్ అసిస్టెంట్, కర్నూలు జాయింట్-2 సబ్‌రిజిస్ట్రార్ కూడా సమయానికి విధులకు హాజరుకాకపోవడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా రిజిస్ట్రార్ శివగోపాల్ ప్రసాద్ కూడా సమయానికి విధుల్లో లేకపోవడంతో ఆయన ఎక్కడా అని డిప్యూటీ సీఎం ఆరా తీశారు. అతను హైదరాబాద్‌కు డ్యూటీ నిమిత్తం వెళ్లారని సిబ్బంది తెలుపుగా.. పేర్కొనగా.. అసలు ఆయన ఆన్‌డ్యూటీపై వెళ్లారా... సెలవు పెట్టారా... అన్న సమాచారం రిజిస్టర్లో పేర్కొనకపోతే ఎలా అని కేఈ కోపోద్రిక్తుడయ్యారు. కర్నూలు కార్యాలయంలో వస్తున్న ఆదాయం గురించి జాయింట్-1 మహబూబ్‌బాషను అడిగారు. గత నెల ఏప్రిల్‌లో టార్గెట్ 2.44 కోట్లు ఉండగా ఆదాయం రూ 5.84 కోట్లు వచ్చిందని వివరించారు. ఈ ఆదాయం కూడా కేవలం బిర్లా కాంపౌండ్ స్థలాల్లో నిర్మితమవుతున్న బిల్డింగులు, అపార్ట్మెంట్ల అమమ్మకాలు కొనుగోలు జరుగుతుండటంతో వస్తుందని డిప్యూటీ సీఎంకు జాయింట్-1 వివరించారు. ఇదే సమయంలో దళారులపై ప్రమేయంపై కేఈ ఆరా తీశారు. వారి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లను చేపట్టాలని, వారిని దూరంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఓ కంటింజెంట్ ఉద్యోగి తనకు రెండు నెలలుగా వేతనం రాలేదని చెప్పగా వెంటనే సంబంధిత ఫైలును పంపిస్తే నిధులు మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ చేపట్టడంతో భద్రతా సిబ్బంది ఎవ్వరిని కార్యాలయాల్లోకి అనుమతించలేదు. అయితే పోలీసులు అడ్డుకున్న వారంతా కార్యాలయ సిబ్బంది కావడం కొసమెరుపు. -
రిజిస్ట్రేషన్లు.. మరింత జటిలం
కొత్త నిబంధనలపై కొరవడిన స్పష్టత జిల్లా అంతటా నిలిచిన రిజిస్ట్రేషన్లు ఆందోళనలో ప్రజలు విజయవాడ : రిజిస్ట్రేషన్లను రెవెన్యూతో లింకు పెట్టడంతో గందరగోళం నెలకొంది. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఇప్పటికే జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ అనుమతి తప్పనిసరని శుక్రవారం రాత్రి 7.20 గంటలకు ప్రభుత్వం జీవో నంబరు 398ను విడుదల చేసింది. తక్షణమే ఈ జీవో అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో కొత్త నిబంధనలు తెలియక శనివారం జిల్లా వ్యాప్తంగా 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు కూడా కొత్త నిబంధనల గురించి పూర్తిగా తెలియక తలలుపట్టుకున్నారు. ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం అక్రమ లే అవుట్లను అడ్డుకునేందుకు, వ్యవసాయ భూములను మార్పు చేయకూడదనే లక్ష్యంతోనే రెవెన్యూ అనుమతించిన భూములకే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కూడా తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం తమకు కాసుల వర్షం కురిపిస్తుందని సంబరపడుతున్నారు. ఇప్పటికే అసైన్డ్ జాబితాలు, గ్రామ కంఠాల్లో ఉన్న ప్రయివేటు ఇళ్ల స్థలాలు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు లేని రైతుల పూర్వార్జిత ఆస్తులను ఎన్వోసీ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రతి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఎన్వోసీల కోసం ఆస్తి, అవసరాలను బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. గందరగోళంగా రెవెన్యూ రికార్డులు ప్రస్తుతం జిల్లాలో రెవెన్యూ రికార్డులన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఆన్లైన్లో అడంగల్స్ ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. ఆర్వోఆర్లు, అడంగల్స్‌లో వేర్వేరు పేర్లు, తప్పులతడకలుగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కోసం వేలాది రూపాయలు ముట్టజెప్పినా నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికే భూముల క్రయవిక్రయాలపై మ్యుటేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అత్యధిక మండలాల్లో 45 రోజులు దాటినా మ్యుటేషన్ జరగటం లేదు. పేర్లు మారినా అడగంగల్స్లో తప్పులను మార్పు చేయించుకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. సర్వేయర్లు అవసరం... వ్యవసాయ భూముల సబ్-డివిజన్ జరగాలంటే ప్రతి గ్రామం, పట్టణాల్లో సర్వేయర్లు పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో ఒకే సర్వే నంబరుపై 10 మందికి సంబంధించిన ఏ, బీ, సీ, డీ నంబర్లు ఉంటాయి. వాటిని సబ్ డివిజన్ చేయడానికి సర్వేయర్ ప్రతి పట్టాదారును గుర్తించి నంబరు మార్చి భూమి రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్-డివిజన్ అయిన తర్వాత ఫీల్డ్ మెజర్మెంట్ బుక్(ఎఫ్ఎంబీ)లో నమోదు అయితేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి పట్టాదార్ పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ఈ క్రమంలో ప్రజలు ప్రతి రిజిస్ట్రేషన్‌కు తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎన్వోసీ పొందాల్సి ఉంటుంది. -
సొంత భవనాల్లేవ్!
ఆదిలాబాద్ : జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బోథ్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (ఎస్ఆర్వోలు) ఉన్నాయి. ఖానాపూర్, లక్సెట్టిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయాలు 2007లో ఏర్పడగా, మిగతావి 1975-1980 మధ్య కాలం నుంచి ఉన్నాయి. ఏటా రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా ప్రభుత్వానికి రూ.70 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. మంచిర్యాల కార్యాలయానికి మాత్రమే సొంత భవనం ఉండగా, మిగతావి ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. లక్సెట్టిపేట కార్యాలయం ప్రభుత్వ విశ్రాంతి గృహంలో కొనసాగుతుండగా, తాజాగా ఆ భవనం కూలిపోయే దశకు చేరుకోవడంతో అక్కడ కూడా అద్దె భవనం కోసం వెతుకుతున్నారు. తాజాగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పడంపై ఉద్యోగులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు. ఇరుకు భవంతులు ఆదిలాబాద్ బస్టాండ్ రోడ్డుకు సమీపంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. దీనికి రూ. నెలకు రూ.16,700 అద్దె చెల్లిస్తున్నారు. ఈ కార్యాలయంలో ఉద్యోగులు కూర్చోవడానికే సరిగ్గా గదులు లేవు. ఉద్యోగులతోపాటు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లి రావాల్సిందే. జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నిర్మాణం కోసం 2012లో రూ.75 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ కార్యాలయానికి సంబంధించిన స్థల వివాదం కారణంగా కాంట్రాక్టరు నిర్మాణం ప్రారంభించలేదు. దీంతో నిధులు గతేడాది వెనక్కి మళ్లాయి. బోథ్ కార్యాలయానికి రూ.63 లక్షలు మంజూరు కాగా, అక్కడ గ్రామ పంచాయతీ స్థలం గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. అయితే భవన నిర్మాణం చేపట్టకపోవడంతో డబ్బులు వెనక్కి వెళ్లాయి. ప్రతి నెల రూ.3,250 అద్దె చెల్లిస్తున్నారు. భైంసాలో రూ.5,500, నిర్మల్ రూ.4 వేలు, ఆసిఫాబాద్‌లో రూ.9వేలు, ఖానాపూర్ రూ.2,200 అద్దె చెల్లిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వానికి అత్యధిక ఆ దాయం ఇచ్చే శాఖల్లో ఒకటైనా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం చోద్యం.