‘రియల్’ ఢమాల్ | The collapse of the real estate business | Sakshi
Sakshi News home page

‘రియల్’ ఢమాల్

Published Sat, Nov 12 2016 3:43 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

‘రియల్’ ఢమాల్

‘రియల్’ ఢమాల్

పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం
వెలవెలబోతున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు
నల్లధనాన్ని మార్చుకునేందుకు తంటాలు
బంధువులు, మిత్రులు, బినామీల ఖాతాల్లో జమ చేసేందుకు యత్నాలు

నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యం క్రయవిక్రయాలు, దస్తావేజులు, రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడే సబ్ రిజిష్టార్ కార్యాలయాలు మూడు రోజులుగా వెలవెల బోతున్నారుు. రోజు పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయాల్లో ప్రస్తుతం నాలుగైదుకు మించి కూడా జరగడం లేదు. జిల్లాలో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగే నిజామాబాద్ రూరల్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు రోజులుగా ఐదారు రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. ఈ రెండు కార్యాలయాల్లో మామూలు రోజుల్లో సుమారు 40 నుంచి 50 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ.500, రూ.100 నోట్లు చెలామణి రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన  తెల్లవారి నుంచి ఈ పరిస్థితి నెలకొంది.

నల్లదనం ఎక్కువగా చెలామణి అయ్యే రంగాల్లో రియల్ ఎస్టేట్ ప్రధానమైనది. ఆయా స్థిరాస్తుల మార్కెట్ ధర కంటే రిజిస్ట్రేషన్ ధరను తక్కువగా పేర్కొంటూ స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరుగుతారుు. ఈ రెండు ధరల మధ్య తేడా మొత్తాన్ని బ్లాక్‌మనీ రూపంలో చేతులు మారుతారుు. పెద్ద నోట్ల రూపంలో ఈ లావాదేవీలు జరుగుతారుు. ఈ పెద్ద నోట్ల చెలామణి రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయంతో ఈ బ్లాక్ మనీతో కూడిన లావాదేవీలు పూర్తిగా పడిపోయారుు. అలాగే రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ముందుగా బ్యాంకుల్లో చలానాలు కట్టాలి. బ్యాంకుల శాఖలన్నీ పెద్ద నోట్ల మార్పిడి పనుల్లోనే నిమగ్నం కావడంతో ఈ చలానాలు తీసుకునే పరిస్థితి లేదు. దీంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయారుు. జిల్లాలో దాదాపు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ దస్తావేజుల రిజిస్ట్రేషన్లు పూర్తిగా పడిపోయారుు. ఈ పరిస్థితి ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని ఆ శాఖ వర్గాలు భావిస్తున్నారుు.

’రియల్’ డబ్బునేం చేద్దాం..
జిల్లాలో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా భూముల ధరలు పెంచేశారు. నిజామాబాద్ నగర శివారుతోపాటు, బోధన్, ఆర్మూర్ వంటి పట్టణాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటీవల జిల్లాగా మారిన కామారెడ్డిలోనైతే రియల్ వ్యాపారులు భూములను అమాంతం పెంచేశారు. రిజిస్ట్రేషన్, మార్కెట్ ధరల మధ్య భారీ తేడాతో పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీని ఆర్జించారు. ఈ మొత్తాన్ని ఎలా చెలామణిలోకి తెచ్చుకునేందుకు ఇప్పుడు తంటాలు పడుతున్నారు. తమ బంధువులు, ఆప్తమిత్రుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామంటూ బతిమాలుకుంటున్నట్లు సమాచారం. ఉన్న ఫలంగా తమ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ అరుుతే ఆదాయపన్ను శాఖ నోటీసులు, వంటి తలనొప్పులు మాకెందుకంటూ చాలా మంది ఇందుకు నిరాకరిస్తున్నారు.

పాత తేదీల్లో బంగారం కొనుగోళ్లు..
తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. నల్లధనాన్ని బంగారం రూపంలో మార్చుకునేందుకు నల్లధనం ఉన్నవారు ప్రయత్నాల్లో ఉన్నారు. పెద్ద నోట్ల చెలామణి రద్దు చేస్తూ మంగళవారం ప్రకటన కంటే ముందు పాత తేదీల్లో బంగారాన్ని కోనుగోలు చేసే అవకాశాలుండటంతో సంబంధిత శాఖల నిఘా వర్గాలు ఈ లావాదేవీలపై దృష్టి సారించారు. పాత తేదీల్లో బంగారాన్ని విక్రరుుంచినట్లు బంగారం వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపకుండా సంబంధిత శాఖల అధికారులు ఈ లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement