1వ తేదీ నుంచి ఆస్తుల విలువలు పెరుగుతాయనే వార్తలతో ఆందోళన
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వస్తే అన్నిటితోపాటు ఆస్తుల విలువలూ పెరగడం తథ్యం. ఇప్పుడూ అదే పరిస్థితి. జనవరి ఒకటో తేదీ నుంచి భూములు, నిర్మాణాల విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అదీ సాదాసీదాగా కాదు.. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు తలకుమించిన భారంగా మారనున్నాయి. ప్రస్తుతం రూ.2 లక్షలు కట్టాల్సిన రిజిస్ట్రేషన్ల ఛార్జీలు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెరగనున్నాయి.
అన్ని రకాల ఆస్తుల విలువల్లో భారీగా పెరుగుదల ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ ఛార్జీల భారం నుంచి తప్పించుకునేందుకు స్థిరాస్తులు కొనే వారు ఈ నెలాఖరులోపే రిజి్రస్టేషన్లు పూర్తి చేసుకునేందుకు హడావుడి పడుతున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.
రెండు రోజులుగా కార్యాలయాల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా రోజుకు 80 వరకు రిజి్రస్టేషన్లు జరుగుతాయి. గురువారం ఒక్క రోజే 220 రిజి్రస్టేషన్లు జరిగాయి. శుక్రవారమూ 250 వరకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment