వెల్దుర్తిలో అధికారుల కాళ్లపై పడుతున్న రైతులు
జగిత్యాల రూరల్: తమ భూములు లాక్కోవద్దని రైతులు తహసీల్దార్‌పై కాళ్లపై పడ్డారు. పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలం తమ పొలంగా పేర్కొంటూ కొందరు రైతులు ఆందోళన చేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది. గ్రామ శివారు సర్వే నంబర్ 125లో బృహత్ పల్లెప్రకృతి వనం నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించారు. ఆ భూమిలో మూడు రోజులుగా నేల చదును చేసే పనులు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది అది తమ భూమి అని పనులు అడ్డుకున్నారు. రూరల్ తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీఓ రాజేశ్వరి మంగళవారం గ్రామానికి వెళ్లి పనులు పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు గ్రామస్తులు.. తమ భూములు లాక్కోవద్దని తహసీల్దార్ కాళ్లపై పడ్డారు. తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు.
చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు
చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment