Veldurti
-
వెల్దుర్తి ప్రజల మంచినీటి సమస్యకు పరిష్కారం
-
‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు
జగిత్యాల రూరల్: తమ భూములు లాక్కోవద్దని రైతులు తహసీల్దార్‌పై కాళ్లపై పడ్డారు. పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలం తమ పొలంగా పేర్కొంటూ కొందరు రైతులు ఆందోళన చేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది. గ్రామ శివారు సర్వే నంబర్ 125లో బృహత్ పల్లెప్రకృతి వనం నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించారు. ఆ భూమిలో మూడు రోజులుగా నేల చదును చేసే పనులు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది అది తమ భూమి అని పనులు అడ్డుకున్నారు. రూరల్ తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీఓ రాజేశ్వరి మంగళవారం గ్రామానికి వెళ్లి పనులు పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు గ్రామస్తులు.. తమ భూములు లాక్కోవద్దని తహసీల్దార్ కాళ్లపై పడ్డారు. తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్ -
కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి..
సాక్షి, వెల్దుర్తి(కర్నూలు): హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)పై గురువారం అర్ధరాత్రి దారిదోపిడీ జరిగింది. వెల్దుర్తి మండల పరిధిలోని మంగంపల్లె, సూదేపల్లె స్టేజ్‌ల మధ్య(అమకతాడు టోల్గేట్ సమీపంలో) చోటుచేసుకున్న ఈ ఘటన సినీ ఫక్కీని తలపించింది. బాధితుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా ఓటికి చెందిన స్వాప్నిక్ తన స్నేహితులు అమర్, మయూర్‌తో కలిసి కారులో మైసూరులో ఉంటున్న అన్న వద్దకు బయలుదేరారు. వీరంతా పాలిష్ కటింగ్ మేస్త్రీలు. గురువారం అర్ధరాత్రి మంగంపల్లె, సూదేపల్లె స్టేజ్‌ల మధ్య కారు వెళ్తుండగా వెనుక నుంచి మరో కారు వచ్చి స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో స్వాప్నిక్, స్నేహితులు వెళుతున్న కారు రోడ్డు నుంచి ఎడమవైపునకు దిగిపోయి పక్కన ఖాళీ స్థలంలో ఆగింది. ఇంతలోనే వెనుక నుంచి ఢీకొన్న కారులోంచి(నంబరు లేని రెడ్ కలర్ కారు) ఐదుగురు దుండగులు దిగి.. స్వాప్నిక్, స్నేహితులు ఉన్న కారు వద్దకు వచ్చారు. వచ్చీ రావడంతోనే కారు ముందు అద్దాన్ని తమ వద్ద ఉన్న పిడిబాకు, కత్తులతో బాది హంగామా చేశారు. ‘పైసా నికాల్’ అంటూ స్వాప్నిక్‌పై దాడికి దిగారు. మొహంపై బాదారు. కత్తులతో బెదిరించారు. స్వాప్నిక్‌తో పాటు అతని స్నేహితులు భయభ్రాంతులకు గురయ్యారు. తమ వద్ద ఉన్న రూ.10వేల నగదు ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా వారి వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు, మూడు బ్యాగులు, కారు తాళం చెవి తీసుకుని తమ కారులో టోల్గేట్ వైపు ఉడాయించారు. కారు ఢీకొనడం, రోడ్డు దిగి వెళ్లిపోవడాన్ని అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు గుర్తించి.. సమీపంలోని టోల్గేట్ సిబ్బందికి సమాచారమందించారు. వారు వచ్చి విషయం తెలుసుకుని వెల్దుర్తి పోలీసులకు తెలియజేశారు. దీంతో ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి సంఘటన స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పిడిబాకులు, కత్తులతో కారు అద్దాలపై దాడి చేసిన సందర్భంగా ఒక కత్తి పిడి వరకు విరగ్గా..దాన్ని అక్కడే పడేశారు.దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. డోన్ రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి, డోన్ రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావ్‌తో కలిసి మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్దుర్తి ఎస్ఐ తెలిపారు. టోల్గేట్లలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు గతంలో ఇలాంటి దోపిడీలు చేసిన వారిపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. గతంలోనూ దోపిడీలు సూదేపల్లె, మంగంపల్లె స్టేజ్‌ల సమీపాన గతంలోనూ పలుమార్లు దారి దోపిడీలు జరిగాయి. దుండగులు వృద్ధురాలిపై దాడికి పాల్పడి, వివస్త్రను చేసిన ఘటనతో పాటు లారీలను అటకాయించి డ్రైవర్లు, క్లీనర్లపై దాడులకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఆ కేసులను ఇప్పటి వరకు పోలీసులు ఛేదించిన దాఖలాలు లేవు. మళ్లీ ఆలాంటి ఘటన చోటుచేసుకోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చదవండి : పెద్దాసుపత్రిలో దొంగలు -
వెల్దుర్తి మృతులకు సామూహిక అంత్యక్రియలు
-
వెల్దుర్తి మృతులకు సామూహిక అంత్యక్రియలు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా వెల్దుర్తి రోడ్డుప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం 16 మృతదేహాలను మృతుల బంధువులకు పోలీసులు అప్పగించారు. కర్నూలు నుంచి గద్వాల జిల్లా రామాపురానికి మృతదేహలను తరలిస్తున్నారు. సామూహిక అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారంతోపాటు మృతుల పిల్లల చదువులు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించేలా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆర్డీవో వెల్లడించారు. ఆర్డీవో ప్రకటనతో మృతుల కుటుంబాలు ఆందోళన విరమించాయి. అయితే, ఎన్నికల కోడ్ అనంతరమే ఈ పరిహారం అందే అవకాశముందని తెలుస్తోంది. -
జర్నీ సినిమాలానే.. గుండె ఆగినంత పనైంది..
సాక్షి, కర్నూలు: వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంతో వోల్వో బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్లే ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ వోల్వో బస్సులో సుమారు 48 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరిన బస్సు కర్నూలుకు 5.30 గంటలకు చేరుకుంది. బళ్లారి చౌరస్తా వద్ద మరో ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు వైపు సాగింది. సుమారు 6.20 గంటల సమయంలో వెల్దుర్తి చెక్‌పోస్టు వద్దకు రాగా.. భారీ కుదుపునకు గురైంది. అంతవరకు సాఫీగా సాగిన బస్సు ప్రమాదానికి గురి కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన అనంతరం తుఫాన్ వాహనాన్ని 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అదే సమయంలో బస్సు డీజిల్ ట్యాంకు లీకవడం, ఇంజిన్‌లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళనలతో కేకలు వేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కిందకు దూకారు. కొంతసేపటికి తేరుకుని ఎవరి దారిన వారు గమ్యస్థానాలకు బయలుదేరారు. చదవండి: (ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం) జర్నీ సినిమాలానే.. జర్నీ సినిమాను నిజంగానే చూసినట్టుంది. ఏమైందో తెలియదు. చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం వచ్చింది. అంతలోనే ఇంజిన్ నుంచి పొగలొచ్చాయి. అరుపులు, కేకలతో ఆందోళనకు గురయ్యా. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అత్యవసర ద్వారం నుంచి కిందకు దూకేశా. – రామలక్ష్మీ ఉపాధ్యాయిని, కస్తూరిబా పాఠశాల, కొత్తపల్లి గుండె ఆగినంత పనైంది బస్సు ప్రమాదానికి గురికావడం.. నెత్తురోడిన గాయాలతో జనాలు అరుస్తుండటం చూసి గుండె ఆగినంత పనైంది. బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఓ వైపు డీజిల్ ట్యాంక్ లీకవడంతో మంటలు అంటుకున్నాయేమోనని భయపడిపోయా. – దిలీప్, బీటెక్ విద్యార్థి, కర్నూలు ప్రాణాలు పోయాయనుకున్నాం బస్సు అదుపు తప్పి దూసుకెళ్లడంతో భయపడిపోయాం. బస్సులో మంటలు వ్యాపించాయని తోటి ప్రయాణికుడు చెప్పడంతో పిల్లాపాపలను ఎలా కాపాడుకోవాలనే ఆందోళనతో బస్సు నుంచి ఒక్కొక్కరినీ దింపేసి నేను కూడా దిగిపోయా.– రూబిత్, కలికిరి, కేరళ -
వెయ్యేళ్ల కళాసృష్టి!
ఏడడుగుల విగ్రహం.. నాలుగు చేతులు, వాటిలో త్రిశూలం, ఖట్వాంగం, గద వంటి ఆయుధాలు.. ఓ కాలు నిటారుగా, మరోకాలు పైకెత్తి ఠీవీగా నిలబడ్డ రూపం.. ఆకృతిలో శివుడి రూపం.. కానీ ద్వారపాలక విగ్రహం.. ఇటీవల ఓ ఇంటి పని కోసం తవ్వుతుండగా బయటపడింది.. ఏదో పెద్ద దేవాలయానికి ముందు స్వాగతం పలుకుతున్నట్టు ఠీవి ఒలకబోస్తున్న ఈ నిర్మాణాలు ఏమిటి? ఎవరు నిర్మించారు? ఏదో గొప్ప చరిత్రకు ఆనవాళ్లా.. శిథిలమైపోయిన వైభవానికి నిదర్శనాలా.. వెయ్యేళ్ల కిందటివిగా నిపుణులు అంచనా వేస్తున్న ఈ నిర్మాణాలు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్నాయి. భారీ ద్వారపాలకుడి విగ్రహం ఇటీవల తోరణానికి సమీపంలో ఉన్న ఆలయానికి కుడివైపున తవ్వుతుండగా ఏడడుగుల ఎత్తున్న ద్వారపాలకుడి విగ్రహం బయటపడింది. పాదాలకు కడియాలు, నడుము దిగువన కీర్తిముఖం, పైన దట్టి, కుడి భుజం నుంచి వేసిన కలాల జంధ్యం, కంఠహారాలు, మూడో నేత్రం, కాకతీయ శైలి కిరీటం, దానిపై త్రిశూల ఆకృతి కనిపిస్తున్నాయి. ఇక ఈ ఆలయానికి సమీపంలోనే ఆంజనేయుడి ఆలయం, నాగశిల్పాలు, శిఖర మండపంలో గరుడ విగ్రహమున్న 20 అడుగుల ఎల్తైన రాతి ధ్వజ స్తంభం, 15 అడుగుల ఎత్తున్న విజయ స్తంభం, పది సోపానాలు, 16 స్తంభాల రంగమండపంతో విఠలేశ్వర మందిరం, దశావతారాలు చెక్కిన 4 అడుగుల వైష్ణవ విగ్రహం.. ఇలా ఆలయాలు, విగ్రహాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ చోటు ఏదో పెద్ద దేవాలయ సమూహం అయి ఉంటుందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల ఆలయాలు, శిల్పాల్లో కాకతీయుల గుర్తులు కనిపిస్తున్నా.. కల్యాణి చాళక్యుల నాటి నిర్మాణాలు అయి ఉంటాయని భావిస్తున్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఎన్నో కొత్త విశేషాలు బయటపడే అవకాశముంది. ఔత్సాహిక పరిశోధకుల పరిశీలనలో.. వెల్దుర్తిలో ఉన్న రాతి తోరణం చాలా కాలంగా ఉన్నా దానిని ఇంతకాలంగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇటీవల అక్కడికి సమీపంలో ఏడడుగుల ఎత్తున్న ద్వారపాలకుడి విగ్రహం వెలుగుచూసింది. దాంతో ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళి, చంటి, మురళీధర్‌రెడ్డి తదితరులు వెల్దుర్తిలోని ఈ నిర్మాణాలను పరిశీలించారు. ఇక్కడి భారీ రాతి తోరణంపై ఇరువైపులా కీర్తి ముఖాలు చెక్కి ఉన్నాయి. పైన రెండు వైపులా శిల్పాల సమూహంతో అర్ధ వృత్తాకారపు నల్లరాతి ఫలకం ఉంది. దానిపై గజలక్ష్మి,, క్షీరసాగర మథనం, శృంగార నారసింహుడు, పాదాల కింద రాక్షసుడి ఆకృతులు కనిపిస్తున్నాయి. తోరణానికి దిగువన ఏడు మొగ్గల ఆకృతులు, వాటికిపైన ఆరు రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల ద్వారా సూర్య కిరణాలు ప్రధాన ఆలయ దేవతామూర్తిని తాకేలా నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే తోరణానికి సమీపంలో ప్రస్తుతం ఓ చిన్న దేవాలయం ఉంది. దాని ముందు నంది విగ్రహం ఉన్నా.. లోపల అనంత శయనుడి విగ్రహమూర్తి ఉండడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ -
పత్తి రైతు ఆత్మహత్య
వెల్దుర్తి (గుంటూరు): అప్పుల బాధతో ఓ పత్తి రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన రైతు ఎం.రాముడు (40) మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి అతడు విగతజీవిగా కనిపించాడు. రాముడు తనకున్న పొలంతోపాటు పక్క గ్రామంలోనూ ఆరెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా నష్టాలు వస్తుండడంతో చేసిన అప్పు రూ.10 లక్షలకు చేరిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల బాధతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వారు విలపిస్తున్నారు. -
వ్యాన్ బోల్తా..ఒకరి మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్ వెనక, ముందు టైర్లు ఒకేసారి పంక్చర్ కావడం వల్లే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ ఉపేంద్ర(40) అక్కడిక్కడే మరణించాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపేంద్ర స్వగ్రామం నల్గొండ జిల్లా తిరుమలగిరి. క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (వెల్దుర్తి) -
‘మాఫీ’ కోసం తిరుగుతూ.. మృత్యుఒడిలోకి..
మెదక్ జిల్లాలో ఘటన వెల్దుర్తి: రుణమాఫీ కోసం కార్యాలయాల చుట్టూ నిత్యం కాళ్లరిగేలా తిరుగుతున్న ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ ఆరెగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుష్కి రాములు(65) తనకున్న ఎకరంన్నర భూమి లో నీటి సౌకర్యం లేక హల్దీవాగు పరిసరాల్లో ఓ వ్యక్తికి చెందిన రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. తన పొలంపై బ్యాంకులో రూ.65 వేలు రుణం పొందాడు. రుణమాఫీపై గురించి తెలుసుకునేందుకు నాలుగు రోజుల క్రితం బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే అధికారులు రుణమాఫీ చేయాలంటే పహాణి సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పడంతో ఈసేవ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ సర ్వర్లు డౌన్ అయ్యాయని నిర్వాహకులు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. ఇదిలా ఉండగా.. అధికారులు ఆహార భద్రతా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణలో బిజీగా ఉండిపోయారు. రెండురోజులుగా తిండీ తిప్పలు లేకుండా అధికారుల చుట్టూ తిరిగాడు. అందులో భాగంగానే గురువారం కూడా రెవెన్యూ కార్యాలయానికి వచ్చి సాయంత్రం ఏడు గంటల సమయంలో గ్రామానికి కాలినడకన బయలుదేరాడు. అయితే ఎలుకపల్లి రోడ్డు వద్దకు రాగానే సొమ్మసిల్లి కిందపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి నీరసించి చనిపోయాడని మృతుడి భార్య యశోద విలపించారు. కొత్త రుణాలకు మాత్రమే పహాణీలు అడిగామని, రుణమాఫీకి ఎలాంటి పత్రాలు అడగలేద సెంట్రల్ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్‌రావు అన్నారు. -
ఎత్తిపోయిన ఎత్తిపోతల పథకం
వెల్దుర్తి : మండలంలోని కుకునూర్ హల్దీవాగులో 20 ఏళ్ల క్రితం రూ. 31 లక్షలు ఖర్చు చేసి ఎత్తి పోతల పథకాన్ని నిర్మించినా, అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, లబ్ధిదారుల అవగాహన లోపం అన్నీ కలగలిపి ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం లక్ష్యాన్ని నీరుగార్చారు. ఫలితంగా 181 మంది రైతు కూలీల బతుకులకు ఆసరా లేకుండాపోయింది. కూలీలను రైతులను చేయాలని భూమి లేని ఎస్సీలను రైతులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం కుకునూర్ హల్దీవాగు ఒడ్డున ఉన్న 181 ఎకరాల సీలింగ్ భూమిని కుకునూర్, పంతుల్‌పల్లి, బస్వాపూర్ గ్రామాలకు చెందిన 181 మంది రైతులకు పంపిణీ చేసింది. నిరుపేద రైతులు ఈ భూముల్లో పంటలు పండించి అభివృద్ధి చెందడం కోసం 1992లో అప్పటి రామాయంపేట ఎమ్మెల్యే అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి కృషి ఫలితంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం రాయితీపై రూ. 22 లక్షలు మంజూరు చేయించారు. ఆ డబ్బులతో 116 ఎకరాలను చదును చేశారు. అంతేకాకుండా విద్యుత్ శాఖకు అవసరమైన డబ్బును కూడా ఎస్సీ కార్పొరేషన్ చెల్లించడంతో అధికారులు ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఐడీసీ సహకారంతో హల్దీవాగులో ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండు బావులు తవ్వి రింగులు వేశారు. ఈ బావుల్లో 7.5 హెచ్‌పీ మోటర్లను బిగించి నీటి సరఫరా కోసం చదును చేసిన భూముల్లో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇక బతుకులు బాగుపడతాయని రైతులంతా భావించారు. కానీ సాగు సలహాలు ఇచ్చేవారు కరువవడంతో రైతులు ఆ పొలాన్నీ వృథా ఉంచేశారు. అలా కొన్ని రోజులు గడిచే సరికి విలువైన పైపులను దొంగలు ధ్వంసం చేయడంతో పాటు కొన్ని పైపులను ఎత్తుకెళ్లారు. అలాగే విద్యుత్ వైర్లు, ప్యానల్ బోర్డులు, స్టాటర్లు, 7.5 హెచ్‌పీ మోటర్లను సైతం చోరులు అపహరించారు. సంవత్సరాలు గడచిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం చెట్లు, ముళ్ల పొదలతో అటవీ ప్రాంతంగా మారింది. ప్రస్తుతం దళితులకు మూడెకరాలు పంపిణీ చేస్తామంటున్న కేసీఆర్ సర్కార్ బీడుగా మారిన భూములను చదును చేసి సాగునీటి సౌకర్యం కల్పిస్తే సాగుకు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాయని, తద్వారా తమ బతుకులు బాగుపడతాయని రైతులు కోరుతున్నారు. బోర్లు వేస్తే సాగు చేసుకుంటాం తమకు ప్రభుత్వం పంపిణీ చేసిన 181 ఎకరాల్లో బోర్లు వేసి మోటర్లు బిగిస్తే కలిసికట్టుగా శ్రమించి పంటలు సాగు చేసుకుంటామని రైతులు తెలిపారు. ప్రతి పది ఎకరాలకు ఓ బోరు వేసి, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు సాగుకు సలహాలు, సూచనలు ఇస్తే సిరులు పండిస్తామని రైతులు చెబుతున్నారు. -
గుప్తనిధుల కోసం నరబలికి యత్నం
వెల్దుర్తి : గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ మేక పిల్లను బలిచ్చి, నరబలి కోసం యువకుడిని సన్నద్ధం చేస్తున్న తరుణంలో ప్రజలు అడ్డుకుని మంత్రగాళ్లను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని నెల్లూర్ గ్రామ శివారు హల్దీవాగు ఒడ్డున ఉన్న చెట్ల పొదల్లో గురువారం తెల్లవారుజామున వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి హల్దీవాగు ఒడ్డున గ్రామానికి చెందిన పిట్ల కిషన్, ఆయన భార్య లక్ష్మి, అతడి సోదరులైన శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన పిట్ల రామ్మోహన్, పిట్ల నరేందర్, అదే గ్రామానికి చెందిన పుల్లెర అశోక్, వెల్దుర్తి పంచాయతీ ఎలుకపల్లి గ్రామానికి చెందిన మంద సత్తయ్య, మెదక్‌కు చెందిన భార్యాభర్తలు కుంట నరసింహులు, సువర్ణ, వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్, చిన్నశంకరంపేట మండలం సూరారానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు క్షద్రపూజలు చేస్తూ జంతుబలినిచ్చారు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన రైతులు పలువురు తమ పొలాలకు నీరు కట్టేందుకు అటు వెళుతూ ఈ విషయాన్ని పసిగట్టారు. సమీపంలోకి వెళ్లి చూడగా బలి ఇచ్చిన మేక పిల్ల, పసుపు, కుంకుమ, కారం, నూనె, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అగరొత్తులు చూసి క్షుద్రపూజలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే నరబలికి కూడా సిద్ధం చేస్తున్నట్లు గుర్తించిన వారు విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించారు. ప్రజలు అక్కడికి చేరుకునే లోపు మెదక్‌కు చెందిన నరసింహులు, ఉప్పులింగాపూర్, సూరారం గ్రామాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మిగిలిన వారిని గ్రామస్తులు పట్టుకుని వచ్చి పాత పంచాయతీ కార్యాలయంలో బంధించారు. అయితే అప్పటికే పరారై కిషన్ ఇంట్లో దాగి ఉన్న మంద సత్తయ్యను గ్రామస్తులు బయటకు తీసుకువచ్చి చితకబాదుతూ పంచాయతీ గదికి తీసుకువచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందిచడంతో వారు వచ్చి వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితులను ఇక్కడ శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారికి నచ్చజెప్పి నిందితులను స్టేషన్‌కు తరలించారు. అయితే గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్న వారికి తీవ్రగాయాలు కావడంతో వారికి మెదక్ ఆస్పత్రికి తరలించారు. విచారణ చేపడుతున్నామని ఏఎస్ఐ మహ్మద్ పాషా తెలిపారు. -
ఆందోళనకు దిగిన ఓటర్లు
వెల్దుర్తి, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యంతో బ్యాలెట్ పేపర్లు తప్పల తడకగా మారాయి. విషయాన్ని గమనించిన ఓటర్లు ఆందోళనకు దిగడంతో కాసేపు పోలింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఎంపీటీసీ పో లింగ్‌ను వాయిదా వేసి జెడ్పీటీసీ పోలిం గ్ను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే..వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని చర్లపల్లి గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌స్టేషన్ నం.6లో వెల్దుర్తి-2 ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఎంపీటీసీ బ్యాలెట్ రెండో బండిల్‌లోని సీరియల్ నం. 2051 నుండి 2100 వరకు ఉన్న 50 బ్యాలెట్ పేపర్లుండగా 2051 నుండి 2065 వరకు వెల్దుర్తి ఎంపీటీసీ-2 నమూన బ్యాలెట్ సరిగానే అచ్చు అయ్యాయి. అయితే 2066 నుండి 2100 వరకు ఉన్న బ్యాలెట్ పేపర్లలో వెల్దుర్తి ఎంపీటీసీ-1 నమూన బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. 44 బ్యాలెట్ పత్రాల్లో గుర్తులు, పేర్లు తప్పుగా ప్రచురితమయ్యాయి. దీనిని ఓటర్లు గమనిం చి అందోళన చేపట్టారు. అప్పటికే ఈ బెండిల్లో 29 ఓట్లు పోలయ్యాయి. విష యం తెలిసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుభాషిణి పోలింగ్ కేంద్రానికి చేరుకొని బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. ఉదయం 8 గంటల నుండి 9.30 గంటల వరకు పోలింగ్ నిలిపివేశారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద పడిగాపులుకాశారు. ఎన్నికల అధికారులకు, కలెక్టర్‌కు అధికారిణి సుభాషిణి విషయాన్ని ఫోన్ ద్వారా వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 9.30 గంటలకు కేవలం జెడ్పీటీసీ ఎన్నికలను మత్రమే ప్రారంభించి ఎంపీటీసీ పోలింగ్‌ను నిలిపివేశారు. త్వరలో రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష ్యంతోనే రీపోలింగ్: జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం స్థానిక ఎన్నికల అధికారులు, పీఓలు, ఏపీఓల నిర్లక్ష్యమే రీపోలింగ్‌కు దారి తీసిందని జిల్లా పరిషత్ సీఈఓ ఆశీర్వాదం పేర్కొన్నారు. పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలుసుకున్న జడ్పీ సీఈఓ ఆశీర్వాదం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ పత్రాలను పరిశీలించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ఆదివారం రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.