
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా వెల్దుర్తి రోడ్డుప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం 16 మృతదేహాలను మృతుల బంధువులకు పోలీసులు అప్పగించారు. కర్నూలు నుంచి గద్వాల జిల్లా రామాపురానికి మృతదేహలను తరలిస్తున్నారు. సామూహిక అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారంతోపాటు మృతుల పిల్లల చదువులు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించేలా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆర్డీవో వెల్లడించారు. ఆర్డీవో ప్రకటనతో మృతుల కుటుంబాలు ఆందోళన విరమించాయి. అయితే, ఎన్నికల కోడ్ అనంతరమే ఈ పరిహారం అందే అవకాశముందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment