సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 378 మంది తహశీల్దార్‌లను బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని తిరిగి వారి స్థానాలకు పంపుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమను బదిలీ చేయాలంటూ గత కొంత కాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
బదిలీల ప్రక్రియ పూర్తి చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు
దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తహసీల్దారు బదిలీల ప్రక్రియను పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. బదిలీలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు మరింత భాధ్యత విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందేలా కృషి చేస్తారని ఆకాంక్షించింది. ఈమేరకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు కారం రవిందర్ రెడ్డి, మమత, మామిళ్ళ రాజేందర్, ఎ.సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేత చిలగాని సంపత్ కుమారస్వామి తదితరులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment